Crime news: దత్త పుత్రికపై రెండేళ్లుగా అత్యాచారం.. తండ్రి, సోదరుల ఘాతుకం.. అసలేం జరిగిందంటే

65 ఏళ్ల వ్యక్తి, అతని ముగ్గురు కుమారులు.. రెండేళ్లుగా తన 17 ఏళ్ల దత్తత కుమార్తెపై అత్యాచారం(Rape) చేశారు. వారి బారి నుంచి ఎలాగోలా బయటపడ్డ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులపై పోక్సో చట్టం...

Crime news: దత్త పుత్రికపై రెండేళ్లుగా అత్యాచారం.. తండ్రి, సోదరుల ఘాతుకం.. అసలేం జరిగిందంటే
Student Harassment
Follow us
Ganesh Mudavath

|

Updated on: Apr 08, 2022 | 3:27 PM

65 ఏళ్ల వ్యక్తి, అతని ముగ్గురు కుమారులు.. రెండేళ్లుగా తన 17 ఏళ్ల దత్తత కుమార్తెపై అత్యాచారం(Rape) చేశారు. వారి బారి నుంచి ఎలాగోలా బయటపడ్డ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నేరాన్ని నివేదించడంలో విఫలమైన వ్యక్తిని, అతని 61 ఏళ్ల భార్య, ఇద్దరు కుమారులను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న చిన్న కుమారుడి కోసం గాలిస్తున్నారు. తమిళనాడు(Tamilanadu) కు చెందిన ఓ జంట అమ్మాయికి జన్మనిచ్చింది. చిన్నారిని పోషించే స్థితిలో వారు లేకపోవడంతో ఒక నెల వయసున్న శిశువును ఇతరులకు అప్పగించారు. ఈ క్రమంలో ఆమె పెరిగి యుక్త వయసులోకి రాగానే దత్తత తీసుకున్న వారు వేధించడం ప్రారంభించారు. ఆమెకు 15 ఏళ్ళ వయసులో చిన్న సోదరుడు లైంగికంగా వేధించాడు(Harassment). తరువాత, మిగతా సోదరులందరూ, దత్తత తండ్రి కూడా ఆమెపై అత్యాచారం చేశారు.

ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. నాలుగు నెలల క్రితం, ప్రాణాలతో బయటపడిన ఆమె తన తోబుట్టువులను ఒక పెళ్లిలో కలుసుకుంది. తనపై జరిగిన లైంగిక వేధింపులను వారితో పంచుకుంది. వారి సహాయంతో నగరంలోని అన్ని మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితును అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో సోదరుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు.. బాధితురాలికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు సంవత్సరం క్రితమే మరణించారు.

Also Read

Viral Video: పెళ్లి కొడుకు స్నేహితుడే డబ్బులు నొక్కేస్తున్నాడు.. వీడియో చూస్తే షాక్..!

Nivetha Pethuraj: కిల్లింగ్ లుక్స్ తో కేకపెట్టించిన కిరాక్ బ్యూటీ నివేదపేత్ రాజ్..

Crotalaria Cunninghami: ఆకుపచ్చ హమ్మింగ్‌బర్డ్‌లా కనిపించే పువ్వులు ఎక్కడ ఉన్నాయో తెలుసా.. వీటిని ఔషదంగా ఉపయోగించే ఆదివాసీలు