Rakeshwar Singh: జవాన్ రాకేశ్వర్ సింగ్ సురక్షితం.. ఫొటోను విడుదల చేసిన మావోయిస్టులు..

Chattisgarh Naxal Attack: మావోయిస్టుల చెరలో ఉన్న రాకేశ్వర్ సింగ్ సురక్షితంగా ఉన్నాడని నక్సల్స్ ఫొటోను విడుదల చేశారు. లేఖ విడుదల చేసిన అనంతరం మావోయిస్టులు రాకేశ్వర్ సింగ్ ఫొటోను

Rakeshwar Singh: జవాన్ రాకేశ్వర్ సింగ్ సురక్షితం.. ఫొటోను విడుదల చేసిన మావోయిస్టులు..
Rakeshwar Singh
Follow us
Shaik Madar Saheb

| Edited By: Team Veegam

Updated on: Apr 07, 2021 | 6:44 PM

Chattisgarh Naxal Attack: మావోయిస్టుల చెరలో ఉన్న రాకేశ్వర్ సింగ్ సురక్షితంగా ఉన్నాడని నక్సల్స్ ఫొటోను విడుదల చేశారు. లేఖ విడుదల చేసిన అనంతరం మావోయిస్టులు రాకేశ్వర్ సింగ్ ఫొటోను సైతం విడుదల చేశారు. చర్చలు జరగనంత వరకూ రాకేశ్వర్ తమ దగ్గర సురక్షితంగా బందీగా ఉంటాడని లేఖలో పేర్కొన్నారు. తమ షరతులను అంగీకరించేంత విడుదల చేయడం కుదరదంటూ స్పష్టంచేశారు. అయితే మావోయిస్టులు విడుదల చేసినట్లు పేర్కొంటున్న ఈ ఫొటో పాతదని రాకేశ్వర్ సింగ్ కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఫొటో ఏడాది క్రితం నాటిదని తెలిపారు.

ఇదిలాఉంటే.. రాకేశ్వర్ విడుదలపై ప్రభుత్వం జాప్యం చేస్తోందని.. ఎలాంటి చర్యలు తీసుకోడం లేదంటూ ఆయన కుటుంబం ఆరోపించింది. ఈ మేరకు జమ్మూలోని రాకేశ్వర్ కుటుంబం జమ్మూ-పూంచ్ రహదారిపై ఆందోళన నిర్వహించింది. కుటుంబం ఐదు రోజుల నుంచి రాకేశ్వర్ విడుదల వార్తపై ఎదురుచూస్తోందంటూ గ్రామస్థులు పేర్కొన్నారు.

Jammu Kashmir

Jammu Kashmir

ఛత్తీస్‌గడ్‌లోని బీజపూర్ జిల్లా తర్రెమ్ అటవీప్రాంతంలోని జొన్నగూడ దగ్గర భారీ ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 24 మంది జవాన్లు మృతి చెందారు. అంతేకాకుండా 31 మంది జవాన్లు గాయపడి చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన అనంతరం జవాన్ల నుంచి మావోయిస్టులు ఆయుధాలను ఎత్తుకెళ్లారు. మావోయిస్ట్ బెటాలియన్ కమాండర్ హిద్మా నాయకత్వంలో ఈ దాడి జరిగింది. మందుపాతర పేల్చి.. ఆ తర్వాత పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. అయితే ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారని మావోయిస్టులు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. తమపైకి రెండు వేల మంది పోలీసులు దాడికి వచ్చారని.. కేంద్ర మంత్రి అమిత్‌షా నాయకత్వంలో ఐదు రాష్ట్రాల పోలీసు అధికారులతో భారీ దాడులకు పథకం పన్నారని లేఖలో ఆరోపించారు.

Also Read: కేంద్రం సంచలన నిర్ణయం.. ఇకపై వర్క్ ప్లేస్‌లలోనూ కోవిడ్ వ్యాక్సినేషన్‌కు అనుమతి.!

ఛత్తీస్‌గడ్ మారణహోమానికి అసలు సూత్రధారి.. ఫ్లాన్ చేస్తే పక్కా గురి.. ఎవరీ మడవి హిడ్మా?

Mask Compulsory: కరోనా ఎఫెక్ట్.. వారికీ మాస్క్ మస్టే.. హైకోర్టు సంచలన తీర్పు..

అడవి పందుల నుంచి రక్షణ కోసం వల పెట్టారు.. అందులో చిక్కింది చూస్తే
అడవి పందుల నుంచి రక్షణ కోసం వల పెట్టారు.. అందులో చిక్కింది చూస్తే
ఆంధ్రప్రదేశ్‌కు ఎంత అప్పు ఉందో అసెంబ్లీలో వెల్లడించిన చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్‌కు ఎంత అప్పు ఉందో అసెంబ్లీలో వెల్లడించిన చంద్రబాబు..
వామ్మో పులి.! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో..
వామ్మో పులి.! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో..
ఆదివాసీ, గిరిజనులతో ప్రధాని బంధం విడదీయలేనిది.. !
ఆదివాసీ, గిరిజనులతో ప్రధాని బంధం విడదీయలేనిది.. !
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..