Chariot wheel: నదిలో స్నానం చేస్తోన్న వ్యక్తికి తగిలిన రాతి వస్తువు.. దేవుడిదంటూ స్థానికుల పూజలు.. సీన్ కట్ చేస్తే.!

ఒడిశా నదిలో దొరికిన రథ చక్రం లాంటి రాతి వస్తువు. మహాభారత కాలం నాటి రథచక్రంగా భావిస్తున్న ఒడిశా వాసులు. పూజలు ప్రారంభించిన స్థానికులు. ఒడిశా రాష్ట్రం లోని ఖడాగ్‌ నదిలో స్నానం చేస్తున్న వ్యక్తి కాలికి తగిలిన ఓ రాతి వస్తువు ఇప్పుడు ఆ రాష్ట్రం లో దైవంగా మారింది. ఇటీవల జరిగిన ఆ ఘటన లో దొరికిన చక్రాన్ని పోలిన గుండ్రటి ఆకారపు రాతి ముక్క స్థానికుల్లో విపరీతమైన ఆసక్తిని కలిగిస్తోంది.

Chariot wheel: నదిలో స్నానం చేస్తోన్న వ్యక్తికి తగిలిన రాతి వస్తువు.. దేవుడిదంటూ స్థానికుల పూజలు.. సీన్ కట్ చేస్తే.!
Chariot Wheel From Mahabharat Era Found In Odisha River, Locals Begin Puja

Edited By:

Updated on: Nov 11, 2023 | 10:00 PM

ఒడిశా నదిలో దొరికిన రథ చక్రం లాంటి రాతి వస్తువు. మహాభారత కాలం నాటి రథచక్రంగా భావిస్తున్న ఒడిశా వాసులు. పూజలు ప్రారంభించిన స్థానికులు. ఒడిశా రాష్ట్రం లోని ఖడాగ్‌ నదిలో స్నానం చేస్తున్న వ్యక్తి కాలికి తగిలిన ఓ రాతి వస్తువు ఇప్పుడు ఆ రాష్ట్రం లో దైవంగా మారింది. ఇటీవల జరిగిన ఆ ఘటన లో దొరికిన చక్రాన్ని పోలిన గుండ్రటి ఆకారపు రాతి ముక్క స్థానికుల్లో విపరీతమైన ఆసక్తిని కలిగిస్తోంది. కంధమాల్‌లోని కె నుగావ్‌ బ్లాక్‌ పరిధిలోని పురునాసాహి గ్రామ సమీపంలోని ఖడాగ్‌ నదిలో స్నానం చేస్తున్న పురుణసాహి గ్రామ నివాసి అయిన సుమంత నాయక్‌ కు ఈ సంఘటన ఎదురైంది.

ఈయన చెప్పిన వివరాల ప్రకారం.. నేను అర్జునఘాట్‌లో స్నానం చేస్తుండగా నదిలో ఈ రాతిచక్రం తగిలింది. దాన్ని బయటకు తీయగా పురాతనమైనదిగా అనిపించింది. ఈ చక్రం అర్జునుడి రథానికి చెందినదని భావిస్తున్నాను” అన్నారు. ఈ విషయాన్ని తానే కనుగొన్నాననే ఆనందం అతని కళ్ళలో కనిపిస్తోంది. అంతేకాదు.. అర్జునుడి రథంలో ఉపయోగించిన చక్రం నదిలో పడి ఉందని కొన్ని రోజుల క్రితం తనకు కల కూడా వచ్చిందనీ, కొన్నాళ్లకు ఇది నిజమైందనీ చెప్తున్నాడు సుమంత నాయక్‌.  పూరీనసాహి గ్రామస్తులు దీనిని ఎంత బలంగా నమ్ముతున్నారంటే, ఇది మహాభారత కాలంలో స్వయంగా శ్రీకృష్ణుడు నడిపిన అర్జునుడి రథం అని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. గుండ్రంగా ఉన్న రాతి చక్రం మధ్యలో ఒక రంధ్రం ఉండటంతో ఇది చక్రం ఆకారంలో కనిపిస్తోంది. ఇక్కడ మరో కొస మెరుపు ఏంటంటే.. చక్రం దొరికిన ప్రదేశాన్ని చాలా కాలంగా అర్జునఘాట్ అని పిలిచేవారట కానీ ఎందుకు అలా పిలుస్తారో ఎవరికీ తెలియదంటున్నారు స్థానికులు.

కానీ ఈ చక్రం లభ్యం ఆయిన తర్వాత శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు ఆ ప్రదేశాన్ని సందర్శించారని, అందుకే దాన్ని అర్జున్ ఘాట్ అనే వాళ్ళనీ స్థానిక ప్రజలు నిజంగా నమ్మడం ప్రారంభించారు. అందుకే చక్రం అక్కడ పడిఉందని వాళ్ళ ప్రగాఢ విశ్వాసం. “ఈ చక్రం అర్జునఘాట్‌లో కనుగొనబడింది. మహాభారత సమయంలో అర్జునుడు తన రథంలో ఉపయోగించిన చక్రం ఇదేనని మేము నమ్ముతున్నాము. మేము దీనిని దేవుని ప్రతిమ గానే ఆరాధిస్తాము” అని మరొక పురుణసాహి స్థానికులు బిలాసిని దిగాల్ తెలపడం విశేషం. దీంతో ఆ పురుణసాహి గ్రామమొక్కటే కాదు చుట్టు పక్కల గ్రామాలకు ఈ వార్త విస్తరించడం తో తండోపతండాలుగా జనం తరలి వచ్చి పూజలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..