Char Dham Yatra: స్టే ఎత్తివేత, మరికొన్ని గంటల్లో చార్ ధామ్ యాత్ర.. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ

కరోనా తోక ముడిచింది, చార్‌ ధామ్ యాత్ర ప్రారంభం కాబోతుంది. మరికొన్ని గంటల్లో మొదలు కానున్న యాత్రకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం పకడ్బందీ

Char Dham Yatra: స్టే ఎత్తివేత, మరికొన్ని గంటల్లో చార్ ధామ్ యాత్ర.. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ
Chardham
Follow us

|

Updated on: Sep 17, 2021 | 8:11 PM

Char Dham Yatra 2021: కరోనా తోక ముడిచింది, చార్‌ ధామ్ యాత్ర ప్రారంభం కాబోతుంది. మరికొన్ని గంటల్లో మొదలు కానున్న యాత్రకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. యాత్రికులు కరోనా నిబంధనలు పాటించాలని స్పష్టం చేస్తోంది. ఫలితంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చార్‌దామ్ యాత్రికుల నిరీక్షణ మరికొన్ని గంటల్లో తీరనుంది. శనివారం నుంచి యాత్ర ప్రారంభం అవుతుందని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు. జూన్‌ 28న చార్‌ధామ్ యాత్రను నిషేధించిన హైకోర్టు.. తాజాగా ఈ స్టే ఎత్తివేసింది.

చమోలి, రుద్రప్రయాగ్, ఉత్తరకాశి జిల్లాలలో జరగబోయే చార్‌ధామ్ యాత్రలో అవసరానికి తగినట్లుగా పోలీసు బలగాలను మోహరించాలని సూచించింది ఉత్తరాఖండ్ సర్కారు. ఇది కాకుండా, భక్తులు ఏ కొలనులోనూ స్నానం చేయడానికి అనుమతించకూడదని హెచ్చరించింది. కేదార్‌నాథ్ ఆలయంలో 800 మంది భక్తులు, బద్రీనాథ్ ఆలయంలో 1200 మంది, గంగోత్రిలో 600 మంది, యమునోత్రి ధామ్‌లో 400 మంది భక్తులను మాత్రమే అనుమతించాని హైకోర్టు తెలిపింది. వాస్తవానికి కొవిడ్‌ థర్డ్‌వేవ్‌ ముప్పు నేపథ్యంలోచార్‌ధామ్‌ యాత్రకు అనుమతించేందుకు హైకోర్టు గతంలో నిరాకరించింది.

యాత్రపై ఉన్న నిషేధాన్ని రెండు రోజుల క్రితం ఉత్తరాఖండ్ హైకోర్టు ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో రేపు ప్రారంభం కానుంది. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులు ఈ యాత్ర చేయాలని సీఎం పుష్కర్ సింగ్ ధామి సూచించారు. పుణ్యక్షేత్రాల ద‌ర్శనానికి ప్రతి రోజూ ప‌రిమితి సంఖ్యలో భ‌క్తుల‌ను అనుమ‌తిస్తామని చెప్పారు సీఎం.

భక్తులు కరోనా నెగెటివ్ రిపోర్ట్‌, వ్యాక్సినేషన్‌కు సంబంధించిన ధృవపత్రాన్ని అధికారులకు చూపించాల్సి ఉంటుంది. చార్‌ధామ్ యాత్రకు వచ్చే భ‌క్తులు య‌మునోత్రి, గంగోత్రి, కేదారీనాథ్‌, బ‌ద్రీనాథ్ వంటి పుణ్య క్షేత్రాల‌ు ద‌ర్శించుకుంటారు. యాత్ర చేపట్టాలనుకునే భక్తులు డెహ్రాడూన్ స్మార్ట్ సిటీ పోర్టల్, దేవస్థానం మేనేజ్‌మెంట్ బోర్డు పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి.

Read also: NIA: షరియా లక్ష్యం.. ఆన్‌లైన్ ద్వారా భావజాల విస్తరణ. ఇస్లామిక్ స్టేట్ వ్యాప్తిపై NIA కీలక ప్రకటన