కన్నీళ్లు పెట్టుకున్న శివన్.. వెన్ను తట్టి ఓదార్చిన మోదీ

ఇస్రో శాస్త్రవేత్తలు ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2కు చివరి దశలో అంతరాయం ఏర్పడింది. చంద్రుడి ఉపరితలానికి 2.1కి.మీల దూరంలో ఉండగా.. విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు నిలిచిపోయాయి. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు నిరాశకు గురయ్యారు. కొన్ని సంవత్సరాలుగా తాము పడ్డ కష్టం.. చివరిలో చేదు ఫలితాలను ఇచ్చిందని వారు ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. మరోవైపు బెంగళూరులోని ఇస్రో సెంటర్ నుంచి శాస్త్రవేత్తలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ సైతం.. మీ కష్టాన్ని దేశమంతా చూసింది. ఇది పరాజయంగా భావించకండి.. […]

కన్నీళ్లు పెట్టుకున్న శివన్.. వెన్ను తట్టి ఓదార్చిన మోదీ
Follow us

| Edited By:

Updated on: Sep 07, 2019 | 9:18 AM

ఇస్రో శాస్త్రవేత్తలు ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2కు చివరి దశలో అంతరాయం ఏర్పడింది. చంద్రుడి ఉపరితలానికి 2.1కి.మీల దూరంలో ఉండగా.. విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు నిలిచిపోయాయి. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు నిరాశకు గురయ్యారు. కొన్ని సంవత్సరాలుగా తాము పడ్డ కష్టం.. చివరిలో చేదు ఫలితాలను ఇచ్చిందని వారు ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. మరోవైపు బెంగళూరులోని ఇస్రో సెంటర్ నుంచి శాస్త్రవేత్తలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ సైతం.. మీ కష్టాన్ని దేశమంతా చూసింది. ఇది పరాజయంగా భావించకండి.. మేమంతా మీ వెంటే ఉన్నాం అని పేర్కొన్నారు. అనంతరం ఆయన బయటకు వెళ్లే సమయంలో ఇస్రో ఛైర్మన్ కె.శివన్ మోదీ వెంట నడిచారు. ఈ ప్రయోగం విఫలం అవ్వడంపై తట్టుకోలేక పోయిన ఆయన కన్నీరు మున్నీరయ్యారు. దీంతో అక్కడే ఉన్న మోదీ ఆయనను వెన్ను తట్టి నిమిరి ఓదార్చారు. అయినా శివన్ తన భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. కాగా చంద్రయాన్ 2 ప్రయోగంపై ఇప్పటికే భారత్ మొత్తం గర్విస్తోంది. మీరు విఫలమవ్వలేదు. ఇప్పటికే మమ్మల్ని గర్వపడేలా చేశారు అంటూ ఇస్రో శాస్త్రవేత్తలపై సామన్యుల నుంచి ప్రముఖులు ట్వీట్లు పెడుతున్నారు.

మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో
మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో
కోటలు దాటేస్తున్న యష్ సినిమా బడ్జెట్.. కారణం ఏంటంటే ??
కోటలు దాటేస్తున్న యష్ సినిమా బడ్జెట్.. కారణం ఏంటంటే ??
శరవేగంగా జరుగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
శరవేగంగా జరుగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
మెదడులో రక్తస్రావం.. ఈ లక్షణాలతో ముందుగానే గుర్తించవచ్చు..
మెదడులో రక్తస్రావం.. ఈ లక్షణాలతో ముందుగానే గుర్తించవచ్చు..