Hit And Run Case: ఘోరం.. వీధి కుక్కలకు ఆహారం వేస్తుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన కారు.. యువతిపై నుంచి..

రోడ్డుపైనున్న వీధి కుక్కలకు ఆహారం వేస్తున్న ఓ యువతిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో యువతి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Hit And Run Case: ఘోరం.. వీధి కుక్కలకు ఆహారం వేస్తుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన కారు.. యువతిపై నుంచి..
Chandigarh Hit And Run Case
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 16, 2023 | 5:39 PM

దేశ రాజధాని ఢిల్లీలో హిట్ అండ్ డ్రాగ్ ఘటన మరువక ముందే.. పలు ప్రాంతాల్లో అలాంటి ఘటనలే జరుగుతుండం కలకలం రేపుతోంది. తాజాగా, పంజాబ్ లోని చండీగఢ్‌లో మరో హిట్ అండ్ రన్ ఘటన జరగడం ఆందోళనకు దారితీసింది. రోడ్డుపైనున్న వీధి కుక్కలకు ఆహారం వేస్తున్న ఓ యువతిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో యువతి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ షాకింగ్ ఘటన శనివారం రాత్రి చండీగఢ్‌ నగరంలో చోటుచేసుకుంది. ఈ ఘటన అనంతరం డ్రైవర్ వాహనంతో సహా అక్కడి నుంచి పరారయ్యాడు.

శనివారం రాత్రి తేజశ్విత (24), ఆమె తల్లి మంజీదర్‌ కౌర్‌లు ఫుట్‌పాత్‌ పక్కనే ఉన్న వీధికుక్కలకు ఆహారం ఇస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. తన కుమార్తెకు తీవ్ర గాయాలు కాగా.. సహాయం చేయడానికి ఎవరూ ఆగలేదని తల్లి పేర్కొంది. చివరకు తన భర్తకు ఫోన్ చేసినట్లు పేర్కొంది.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

ఈ దృశ్యాలు ఫర్నీచర్ మార్కెట్ సమీపంలో అమర్చిన సీసీటీవీలో రికార్డయినట్లు పోలీసులు వెల్లడించారు. తేజశ్విత తలకు తీవ్రగాయలయ్యాయని.. సెక్టార్ 61లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని పేర్కొన్నారు. రాంగ్ సైడ్ నుంచి వేగంగా వస్తున్న కారు బలంగా ఢీకొట్టినట్లు తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు చంఢీగఢ్ పోలీసులు తెలిపారు. వాహనం, డ్రైవర్ కోసం అన్వేషణ కొనసాగుతోందని.. త్వరలోనే పట్టుకుంటామని వివరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..