Petrol and Diesel: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదలనే కారణమని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. సోమవారం నాడు వడోదరలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి) విస్తరణకు సంబంధించి గుజరాత్ ప్రభుత్వం, ఐఓసి మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గాంధీనగర్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మీడియా సమావేశంలో మాట్లాడిన కేంద్ర మంత్రి.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు బాగా పెరిగాయనే విషయాన్ని అంగీకరించారు. అయితే, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలంటే ఏం చేయాలనేదానిపైనా ఉపాయం చెప్పారు ధర్మేంధ్ర ప్రదాన్. పెరుగుతున్న ఇంధన ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కలింగించాలంటే పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం సరైన మార్గం అన్నారు. అలా చేయడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని పేర్కొన్నారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి పెట్రోల్, డీజిల్ తీసుకురావడంపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.
ముడి చమురు బ్యారెల్‌కు 70 డాలర్లు..
గత కొద్ది రోజులుగా అంతర్జాతీయంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరగిపోతున్నాయి. తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు బ్యారెల్ ధర 70 డాలర్ల కు చేరుకుంది. ఈ కారణంగా దేశీయ మార్కెట్లో కూడా ధరలు పెరిగాయి. ఫలితంగా వినియోగదారులపై విపరీతమైన భారం పడుతోంది. ఇక విదేశాల నుంచి భారత్ 80 చమురును దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురుపై కేంద్ర, రాష్ట్రాలు పన్నులు విధించడం వల్ల.. ఒక లీటర్ పెట్రోల్, డీజీల్ ధరలు రూ. 100 దాటిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Also read: