Death Sentence: ఉరిశిక్ష అమలు చేసే పద్ధతిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..

|

May 02, 2023 | 3:33 PM

మరణశిక్ష పడిన ఖైదీలకు ప్రస్తుతం అమలు చేస్తున్న ఉరిశిక్ష పద్ధతిని పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయని కేంద్రం తరఫున అటార్నీ జనరల్‌ ఆర్‌. వెంకటరమణి సుప్రీంకోర్టుకు వెల్లడించారు.

Death Sentence: ఉరిశిక్ష అమలు చేసే పద్ధతిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..
Central Government
Follow us on

మరణశిక్ష పడిన ఖైదీలకు ప్రస్తుతం అమలు చేస్తున్న ఉరిశిక్ష పద్ధతిని పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయని కేంద్రం తరఫున అటార్నీ జనరల్‌ ఆర్‌. వెంకటరమణి సుప్రీంకోర్టుకు వెల్లడించారు. మరణశిక్ష పడిన ఖైదీలను ఉరితీసే పద్ధతి సరైనదేనా లేకా ఇతర ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయా అనే వాటిపై పరిశీలించేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు అవసరమని సుప్రీంకోర్టు ఇచ్చిన సలహాను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. అయితే కమిటీ సభ్యులను ఎంపిక చేసేందుకు కొన్ని ప్రక్రియలు ఉంటాయి.

ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయి. అయితే దీనిపై స్పందించేందుకు మరింత సమయం కావాలని అటార్నీ జనరల్ తెలిపారు.మరణశిక్ష అమలులో ఉరితీసే పద్ధతికి ఉన్న రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ గతంలో న్యాయవాది రిషి మల్హోత్రా సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అమెరికాలో ప్రాణాంతకమైన ఇంజక్షన్‌ ద్వారా అమలు చేస్తున్న మరణశిక్షతో పోల్చి చూస్తే ఉరిశిక్ష వేయడమనేది అత్యంత క్రూరమైన, దారుణమైన విధానమని ఆ పిటీషన్ లో పేర్కొన్నారు.

 

ఇవి కూడా చదవండి

ఈ ఏడాది మార్చిలో దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఉరిశిక్షకు బదులు మానవీయ పద్ధతుల్లో వేరే ప్రత్యామ్నాయాలు ఉన్నాయనే అంశాలను పరిశీలించేందుకు మరింత సమాచారం అవసరమని కేంద్రానికి సూచించింది. దీనిపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అయితే ఇందుకు అంగీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ ధర్మాసనం.. ఈ కేసులో తదుపరి విచారణ తేదీని వేసవి సెలవుల తర్వాత ప్రకటిస్తామని స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి..