Padma Awards 2023: పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. లిస్టులో చినజియర్ స్వామి, కీరవాణి సహా పలువురు తెలుగువారు..

రేపు జరగనున్న 74వ గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రతిష్టాత్మక పద్మ అవార్డు గ్రహీతలను ప్రకటించింది. పలు రంగాల్లో విశేష కృషి చేసిన వారిని అత్యున్నత పౌర పురస్కారాలతో ఏటా

Padma Awards 2023: పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. లిస్టులో చినజియర్ స్వామి, కీరవాణి సహా పలువురు తెలుగువారు..
List Of Padma Awardees 2023
Follow us

|

Updated on: Jan 25, 2023 | 10:28 PM

రేపు జరగనున్న 74వ గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రతిష్టాత్మక పద్మ అవార్డు గ్రహీతలను ప్రకటించింది. పలు రంగాల్లో విశేష కృషి చేసిన వారిని అత్యున్నత పౌర పురస్కారాలతో ఏటా కేంద్ర ప్రభుత్వం సత్కరిస్తుంది. ఈ క్రమంలోనే 2023 సంవత్సరానికి కూడా 106 మందితో కూడిన పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డు గ్రహీతల జాబితాను గణతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందుగా ఈ రోజు(జనవరి 25) ప్రకటించింది కేంద్రం. ఇక ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి కూడా నలుగురు ఉండడం విశేషం. మొత్తం 106 మంది ఉన్న ఈ జాబితాలో పద్మ విభూషణ్(6), పద్మభూషణ్(9), పద్మశ్రీ(91) గ్రహీతలు ఉన్నారు. ఇంకా వీరిలో పలువురు తెలుగువారు కూడా ఉండడం విశేషం. అలాగే ఈ జాబితాలో ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్) సృష్టికర్త దిలీప్ మహలనాబిస్ వైద్యరంగంలో (పీడియాట్రిక్స్) పద్మవిభూషణ్ (మరణానంతరం) అందుకోనున్నారు. ఆయనతో పాటు వివిధ రంగాలలో గణనీయమైన రీతిలో కృషి చేసినవారికి ఈ అవార్డులు వరించాయి.

కాగా, పద్మ అవార్డు భారతదేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో, అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో ఒకటి. 1954 నుంచి అంద చేస్తున్న ఈ అవార్డును మూడు విభాగాల(పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ)లో ప్రదానం చేస్తారు. కళలు, సాహిత్యం, సైన్స్, ప్రజా సేవ వంటి వివిధ రంగాలలో అసాధారణ విజయాలను గుర్తించి.. వాటి గురించి  ప్రజలకు తెలియజేయడానికి ఈ అవార్డులను అందజేస్తారు. ఇక గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి భవన్‌లో జరిగే వేడుకల కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ఈ అవార్డులను గ్రహీతలకు అందజేస్తారు. ఈ అవార్డులు భారతీయ పౌరులతో పాటు విదేశీ పౌరులకు కూడా అందిస్తారు. అవార్డుల ఎంపిక ప్రక్రియ ప్రత్యేకంగా నియమితమైన కమిటీ నుంచి వచ్చిన సిఫార్సులపై ఆధారపడి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

పద్మ అవార్డు గ్రహీతలు:

తెలుగువారు:

పద్మ అవార్డు గ్రహీతలలో తెలుగువారు చాలా మంది ఉన్నారు. వారిలో తెలంగాణ నుంచి ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు స్వామీ చిన్నజియార్(పద్మభూషణ్ అవార్డు), శ్రీ కమలేశ్ డీ పటేల్(పద్మభూషణ్ అవార్డు), మోదడుగు విజయ గుప్తా(పద్మశ్రీ అవార్డు), సామాజిక కార్యకర్త బీ. రామకృష్ణారెడ్డి(పద్మశ్రీ అవార్డు).. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి(పద్మశ్రీ అవార్డు), అబ్బారెడ్డి నాగేశ్వరావు(పద్మశ్రీ అవార్డు, సీవీ రాజు(పద్మశ్రీ అవార్డు), కోటా సచ్చిదానంద శాస్త్రీ(పద్మశ్రీ అవార్డు), ప్రకాశ్ చంద్రసూడ్(పద్మశ్రీ అవార్డు) కాకినాడవాసి సంకురాత్రి చంద్రశేఖర్‌(పద్మశ్రీ అవార్డు).

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..