Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rash Driving: బ్రిడ్జీపై ర్యాష్ డ్రైవింగ్.. తృటిలో తప్పిన మృత్యువు.. షాకింగ్ వీడియో..

Caught on camera - Rash driving: చేతిలో స్టిరింగ్ ఉంటే.. చాలా మంది రోడ్డుపై రయ్.. రయ్ మంటూ దూసుకెళ్తుంటారు. ముందు, వెనుక ఆలోచించకుండా..

Rash Driving: బ్రిడ్జీపై ర్యాష్ డ్రైవింగ్.. తృటిలో తప్పిన మృత్యువు.. షాకింగ్ వీడియో..
Rash Driving
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 15, 2021 | 2:49 PM

Caught on camera – Rash driving: చేతిలో స్టిరింగ్ ఉంటే.. చాలా మంది రోడ్డుపై రయ్.. రయ్ మంటూ దూసుకెళ్తుంటారు. ముందు, వెనుక ఆలోచించకుండా.. ర్యాష్ డ్రైవింగ్‌తో రోడ్డుపై భయభ్రాంతులకు గురిచేస్తుంటారు. అయితే.. ర్యాష్ డ్రైవింగ్ ప్రమాదమని తెలిసినా.. అస్సలు పట్టించుకోని వారికి ఈ వీడియో ఆలోచించేలా చేస్తోంది. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని మార్తండం వంతెనపై జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేగంగా వెళుతున్న మహింద్రా జైలో కారు ర్యాష్ డ్రైవింగ్‌తో ఒక్కసారిగా పల్టీలు కొట్టింది.

వంతెనపై వాహనాలు వెళుతున్నాయి. ఈ క్రమంలో ట్రాఫిక్ ఉన్నప్పటికీ.. ఎదురుగా ఉన్న వాహనాన్ని ఓవర్‌టెక్ చేసి దూసుకువచ్చిన మహీంద్రా జైలో కారు.. అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ఈ సంఘటన అంతా వెనుక ఉన్న వాహనం కెమెరాలో రికార్డయింది. ప్రమాదకరంగా బ్రిడ్జి రెయిలింగ్‌కు ఢికొట్టి కారు పల్టీలు కొడుతుంది. అదృష్టం ఏమిటంటే.. వాహనం కిందపడలేదు. దీంతో వాహనంలో ఉన్న వారికి తీవ్రగాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు.

వీడియో..

Also Read:

Nuclear weapons: ప్రపంచంలో అణ్వాయుధాల సంఖ్య తగ్గింది.. కానీ ఉన్నవాటి సామర్ధ్యం మరింత పెరిగింది!

Worm Selling on Amazon : అమెజాన్‌లో అమ్ముడవుతున్న పురుగు..! దీని స్పెషల్‌ ఏంటో తెలిస్తే షాక్ తింటారు..?