పీఎఫ్ విత్‌డ్రా చేసుకున్నారా? పన్ను పడే ఛాన్స్ ఉందట!

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు మార్చి చివరి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ అమలు పరుస్తోన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో డబ్బులేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక అవసరాల కోసం పీఎఫ్ ఖాతా నుంచి నగదు ఉపసంహరించేందుకు...

పీఎఫ్ విత్‌డ్రా చేసుకున్నారా? పన్ను పడే ఛాన్స్ ఉందట!
Follow us

| Edited By:

Updated on: Jul 03, 2020 | 11:39 AM

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు మార్చి చివరి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ అమలు పరుస్తోన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో డబ్బులేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక అవసరాల కోసం పీఎఫ్ ఖాతా నుంచి నగదు ఉపసంహరించేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. ఈ వెసులు బాటులో చాలా మంది ఉద్యోగులు పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు విత్‌ డ్రా చేసుకున్నారు. ఈ లెక్కన ఏప్రిల్ నుంచి 55 లక్షలకు పైగా ఖాతాదారులు రూ.15 వేల కోట్లను విత్‌డ్రా చేశారు. అయితే ఇది ఆదాయపన్ను పరిధిలోకి వస్తుందో రాదో చూసుకోవడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

ఇన్‌కమ్ టాక్స్ పరిధిలోకి మీరు విత్‌డ్రా చేసుకున్న సొమ్ము వస్తే కనుక.. ఖచ్చితంగా కొంత నష్టపోవాల్సి ఉంటుందన్నారు. ఐదేళ్ల సర్వీస్ తర్వాత ఉపసంహరిస్తే మాత్రం అసలు, వడ్డీకి పన్ను మినహాయింపు వర్తిస్తుందని పేర్కొన్నారు. అంతకన్నా ముందే డబ్బులు తీసుకుంటే ఉద్యోగి, యజమాని జమ చేసిన వడ్డీకి పన్ను కట్టాల్సి ఉంటుంది. ఉద్యోగి జమ చేసిన మొత్తానికి మాత్రం సెక్షన్ 80సీ ప్రకారం మినహాయింపు పొందవచ్చని అంటున్నారు.

అయితే ఉద్యోగి ఆరోగ్యం బాగాలేక, అనివార్య కారణాల వల్ల యాజమాని వ్యాపారం నిలిపివేసిన తరువాత పీఎఫ్ ఉపసంహరించే.. డబ్బుపై ఇన్‌కమ్ టాక్స్ ఉండదు. అలాగే ఖాతాదారుడు ఉద్యోగం మారి తన పాత అకౌంట్‌ను బదిలీ చేయించుకుని సర్వీస్ కొనగిస్తూ ఉంటే పన్ను మినహాయింపునకు అర్హులు. ఉద్యోగి ఉద్యోగం మారినప్పుడు యూనివర్సల్ అకౌంట్ నంబర్‌ని ఉపయోగించుకుని ఖాతాను బదిలీ చేసుకోవాలి. పాత ఖాతా నుంచి కొత్తదానిలోకి డబ్బులు బదిలీ అవ్వగానే మినహాయింపు, ఉపసంహరణకు అర్హత పొందుతారని ఆర్థిక నిపుణులు వెల్లడించారు.

Read More: ఉత్తరాది రాష్ట్రాల్లో పిడుగులు.. ఒక్క రోజే 31 మంది మృతి..

మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే