AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నువ్వేం మనిషివిరా.. అంబులెన్స్‌కు దారి ఇవ్వకుండా ఏం చేశాడో చూడండి..

రోడ్డుపై వెళ్తున్నప్పుడు సడెన్‌గా అంబులెన్స్ వస్తే ఎవరైన దారి ఇస్తారు. వీఐపీల నుంచి సామాన్యుల వరకు దీన్ని తప్పక ఫాలో అవుతారు. కానీ ఓ వ్యక్తి మాత్రం అంబులెన్స్ దారి ఇవ్వకుండా పిచ్చి చేష్ఠలకు పాల్పడ్డాడు. ఎంత హారన్ కొట్టినా దారి ఇవ్వలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: నువ్వేం మనిషివిరా.. అంబులెన్స్‌కు దారి ఇవ్వకుండా ఏం చేశాడో చూడండి..
Car Driver Blocks Ambulance In Jammu
Noor Mohammed Shaik
| Edited By: Krishna S|

Updated on: Oct 08, 2025 | 3:04 PM

Share

జమ్మూలో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది.. ఒక వ్యక్తి చేసిన పనికి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే అత్యవసరంగా రోగిని తీసుకెళ్తున్న అంబులెన్స్‌కు దారి ఇవ్వకుండా ఒక కారు డ్రైవర్ మొండిగా అడ్డుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జమ్మూలోని నాగ్రోటా ప్రాంతంలో ఓ కారు అంబులెన్స్‌కు అడ్డుపడింది. ఆ అంబులెన్స్ రోగిని కత్రాలోని ఆసుపత్రికి తీసుకెళ్తుంది. అయితే అంబులెన్స్ డ్రైవర్ ఎంత హారన్ కొట్టినా, ఆ కారు పదేపదే దారి ఇవ్వకుండా అడ్డుకుంది. దీనిని అంబులెన్స్‌లోని వ్యక్తి రికార్డ్ చేసి సోషల్పె మీడియాలో పెట్టడంతో  వైరల్‌గా మారింది.

వీడియో వైరల్ అయిన కొద్దిసేపటికే జమ్మూ పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని నాగ్రోటా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఆ వాహనాన్ని సీజ్ చేసి.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారు డ్రైవర్‌ను వెంటనే అరెస్ట్ చేశారు. అత్యవసర సేవలకు అడ్డుపడటం చట్టప్రకారం పెద్ద నేరం. అందుకే పోలీసులు ఆ డ్రైవర్‌కు తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నారు. నెటిజన్లు మాత్రం అంబులెన్స్‌కు దారి ఇవ్వడం మనందరి బాధ్యత అని గుర్తు చేస్తున్నారు.

వీడియో చూడండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..