Budget 2021: శుక్రవారం నుంచి బడ్జెట్ సమావేశాలు.. ఉద్యోగులందరికి కరోనా పరీక్షలు.. ఉభయ సభలనుద్ధేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి..
Budget 2021: బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభమవుతున్నాయి. మొదటగా రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ఉభయ సభలను ఉద్ధేశించి ప్రసంగిస్తారు.

Budget 2021: బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభమవుతున్నాయి. మొదటగా రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ఉభయ సభలను ఉద్ధేశించి ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ దేశ బడ్జెట్‌ను సమర్పిస్తారు. ఇదిలా ఉండగా బడ్జెట్ సెషన్ కోసం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు జరిగాయి. భద్రత దృష్ట్యా, బడ్జెట్ సెషన్‌కు ముందు సభ్యులందరికీ, ఉద్యోగులకూ కరోనా పరీక్షను తప్పనిసరి చేశారు.
ఈ సందర్భంగా 1,209 మంది అధికారులు, సచివాలయ ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించగా అందరికి నెగిటివ్ రిపోర్టులు వచ్చాయి. రాష్ట్రపతి ప్రసంగం శుక్రవారం ఉదయం 11.00 నుంచి ప్రారంభమవుతుంది. సెంట్రల్ హాల్‌లో 144 మంది పార్లమెంటు సభ్యులు, మంత్రుల మండలి, లోక్‌సభ, రాజ్యసభ ప్రత్యేక కమిటీల ఛైర్‌పర్సన్స్, ఉభయ సభల్లోని వివిధ పార్టీలు, గ్రూపుల నాయకులు, మాజీ ప్రధాని, జాతీయ అధ్యక్షుడు ఉంటారు. సభ్యులందరూ ఒకరికొకరు 6 అడుగుల దూరంలో కూర్చుంటారు. రాష్ట్రపతి ప్రసంగం సందర్భంగా పార్లమెంటు సభ్యులు సెంట్రల్ హాల్‌తో పాటు లోక్‌సభ, రాజ్యసభల్లో కూర్చోవడం ఇదే మొదటిసారి.
బడ్జెట్ సెషన్ రెండు భాగాలుగా ఉంటుంది. 29 జనవరి నుంచి 15 ఫిబ్రవరి వరకు తొలివిడత సమావేశాలు జరగనుండగా, మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో విడత బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్ పత్రాలు, ఆర్థిక సర్వే తదితర విషయాలన్ని డిజిటల్ మాద్యమంలో అందుబాటులో ఉంటాయి. లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలు ఐదు గంటల షిఫ్టులలో నడుస్తాయి. రాజ్యసభ కార్యకలాపాలు ఉదయం షిఫ్టులో ఉండగా, సాయంత్రం షిఫ్టులో లోక్‌సభ కార్యకలాపాలు నిర్వహిస్తారు.
Budget 2021: కొత్త బడ్జెట్‌పై స్టార్టప్స్ కోటి ఆశలు.. ఇంతకీ వీరు ఏం కోరుకుంటున్నారంటే..