Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2021: కొత్త బడ్జెట్‌పై స్టార్టప్స్ కోటి ఆశలు.. ఇంతకీ వీరు ఏం కోరుకుంటున్నారంటే..

Startups Expectations From budget 2021: కరోనా సంక్షోభ సమయంలో ప్రవేశ పెడుతోన్న బడ్జెట్ కావడంతో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన సగటు ఉద్యోగి నుంచి పెద్ద పెద్ద కంపెనీల..

Budget 2021: కొత్త బడ్జెట్‌పై స్టార్టప్స్ కోటి ఆశలు.. ఇంతకీ వీరు ఏం కోరుకుంటున్నారంటే..
Follow us
Narender Vaitla

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 31, 2021 | 7:02 PM

Startups Expectations From Budget 2021: కరోనా సంక్షోభ సమయంలో ప్రవేశ పెడుతోన్న బడ్జెట్ కావడంతో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన సగటు ఉద్యోగి నుంచి పెద్ద పెద్ద కంపెనీల వరకు బడ్జెట్‌పై కోటి ఆశలతో ఉన్నారు. ఇందులో భాగంగానే భారత ఆర్థిక వ్యవస్థను శాసించేందుకు సిద్ధంగా స్టార్టప్స్ కూడా 2021-2022 బడ్జెట్‌పై భారీగానే అంచనాలు ఏర్పరుచుకున్నాయి. ఈ క్రమంలోనే పలు రంగాల్లోని స్టార్టప్స్ ఈ బడ్జెట్‌లో భారీ ఎత్తున నిధులు కేటాయించాలని కోరుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా ఆయుర్వేద రంగంలో ప్రపంచస్థాయి పరిశోధన, ఉత్పత్తి, అభివృద్ధి, ఆవిష్కరణలకు ఉపయోగపడే బలమైన వ్యవస్థను తయారుచేసేందుకు నిధులు అత్యవసరమని వారి భావన. ఇందులో భాగంగా ఆయుర్వేద మందులు, ఉత్పత్తులపై జీఎస్టీ రద్దు చేయాల్సిన అవసరముందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇక రానున్న బడ్జెట్‌లో మెరుగైన ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలు, బలమైన డేటా, రక్షణ వ్యవస్థలు, మరిన్ని పన్ను మినహాయింపులు అందిస్తాయని స్టార్టప్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. మరి కొంగొత్త ఆశలతో వస్తోన్న కొత్త బడ్జెట్ స్టార్టప్ భారతాన్ని ఏ మేర ఆదుకుంటుందో చూడాలి.

Also Read: Budget 2021: ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం… బ‌డ్జెట్లో నిధుల రెట్టింపు… ఎన్ని కోట్లు కేటాయించ‌నున్నారంటే..?