Budget 2021: ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం… బ‌డ్జెట్లో నిధుల రెట్టింపు… ఎన్ని కోట్లు కేటాయించ‌నున్నారంటే..?

సార్వత్రిక బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. నూతన ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య‌ రంగానికి నిధులను రెట్టింపు...

Budget 2021: ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం... బ‌డ్జెట్లో నిధుల రెట్టింపు... ఎన్ని కోట్లు కేటాయించ‌నున్నారంటే..?
Economic Survey 2020-21
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 31, 2021 | 7:08 PM

సార్వత్రిక బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. నూతన ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య‌ రంగానికి నిధులను రెట్టింపు చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. 2019-20 ప్ర‌జారోగ్యానికి బ‌డ్జెట్‌లో రూ.62,600 కోట్లు ఖ‌ర్చు చేస్తే.. ఈసారి ఆ మొత్తాన్ని రూ.1.2-1.3 లక్షల కోట్లకు పెంచే అవకాశాలున్నాయని ఆర్థిక వేత్త‌లు తెలుపుతున్నారు. కాగా ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన వార్షిక బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతున్నారు.

క‌రోనా నేప‌థ్యంలో…

దేశ జీడీపీలో కేంద్రం వైద్య‌, ఆరోగ్య రంగానికి పెట్టే ఖర్చు 1.3 శాతం మాత్ర‌మే. అభివృద్ధి చెందుతున్న దేశాలు పెడుతున్న ఖర్చులో ఇది చాలా తక్కువ. 1.06 కోట్ల మందికి ఈ వైరస్‌ సోకడంతో కేంద్రం ఆరోగ్యరంగంపై ప్రధానంగా దృష్టి సారించింది. వచ్చే నాలుగేండ్లకాలంలో దేశ జీడీపీలో ఆరోగ్య రంగానికి పెట్టే ఖర్చు 4 శాతానికి పెంచే అవకాశాలున్నాయని ఆర్థిక నిఫుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.