AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deep Dive - Empuraan Movie Controversy : నిను వీడని నీడను నేను.. కాంట్రవర్సీయే కలెక్షన్ సీక్రెట్టా ..?

Deep Dive – Empuraan Movie Controversy : నిను వీడని నీడను నేను.. కాంట్రవర్సీయే కలెక్షన్ సీక్రెట్టా ..?

Rajitha Chanti

|

Updated on: Apr 11, 2025 | 8:36 AM

మోహన్ లాల్ సినిమా అంటే అదో స్పెషల్. 40 ఏళ్ల ఇండస్ట్రీ. దాదాపు 350 సినిమాల్లో నటించారు. అక్కడి అభిమానులకు ఆరాధ్య దైవమనే చెప్పాలి. వివాదాల జోలికి పోరు. కులం, మతం, వర్గం ఇలా అన్నింటికీ అతీతంగా ఆయనకు అభిమానులున్నారు. కానీ ఎంపురాన్ మూవీ వివాదాల సుడిగుండంలో చిక్కుకోవడంతో.. తమ వల్ల మొత్తం యూనిట్ తరపున సారీ చెప్పారు.

కాంట్రవర్సీ ఉంటేనే కాసుల వర్షం కురుస్తుందా? ఓ సినిమా హిట్ కొట్టాలంటే.. వివాదాల అగ్గి రాజుకోవాలా? సెగ రగిలేలా.. మంట పెరిగేలా.. నాలుగు సీన్లు పెట్టకపోతే.. సినిమా హిట్ అవ్వదా? ఎందుకంటే.. ఈమధ్య రిలీజ్ అయిన ఎంపురాన్ సినిమాను చూస్తే.. చాలామంది ఇలానే ఫీలయ్యారు. అందులోనూ ఆ సినిమా వచ్చింది మలయాళ చిత్ర సీమ నుంచి. క్వాలిటీ ఉన్న మూవీ చూడాలి బాబాయ్ అంటే.. వెంటనే మలయాళ సినిమా పేరు చెబుతారు. వాళ్లవన్నీ ఆర్ట్ ఫిలింస్ అనేవారూ ఉన్నారు. అలాంటి మాలీవుడ్ సినిమాలో.. ఈ కాంట్రవర్సీల కథేంటి? వివాదాలకు దూరంగా ఉండే మోహన్ లాల్ ఎందుకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది? పృథ్విరాజ్ సుకుమారన్ చుట్టూ అల్లుకున్న వివాదాల సంగతేంటి? ఆ సినిమా ఫస్ట్ షాట్ నుంచి ఎండ్ కార్డ్ వరకు చూస్తే.. కొన్ని వివాదాస్పదమైన అంశాలను ప్రస్తావించారు. వాటిని కావాలని పెట్టారా.. లేక.. ఆటోమేటిగ్గా వాటి చుట్టూ అగ్గి రాజుకుందా అన్నది కూడా ముఖ్యమైన పాయింటే. ఈ సినిమా చుట్టూ ఇంత డిస్కషన్ జరిగేసరికీ.. ప్రొడ్యూసర్ కు మాత్రం కనకవర్షం కురిసింది. ఇంతకీ ఈ సినిమాకు ఇలా పేరు రావడానికి కారణమేంటి? ఈ వీడియోలో చూసేయ్యండి.