AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: ఏపీ విద్యార్ధులకు బిగ్ అలెర్ట్.. రేపే ఇంటర్ ఫలితాలు.. లింక్ ఇదిగో

ఏపీ ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అలెర్ట్. రేపు అనగా శనివారం ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. మరి ఇంటర్ ఫలితాలను ఎలా చూడొచ్చు.? ఏ టైంకు విడుదల అవుతాయో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

Andhra News: ఏపీ విద్యార్ధులకు బిగ్ అలెర్ట్.. రేపే ఇంటర్ ఫలితాలు.. లింక్ ఇదిగో
Students
Eswar Chennupalli
| Edited By: Ravi Kiran|

Updated on: Apr 11, 2025 | 12:00 PM

Share

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫలితాలు రేపు(శనివారం) విడుదల కానున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఫలితాలను ఏప్రిల్ 12, 2025 శనివారం ఉదయం 11 గంటల నుంచి చూసుకోవచ్చు. విద్యార్థులు తమ ఫలితాలను https://resultsbie.ap.gov.in అనే అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో పొందవచ్చు. అలాగే సాంకేతికతను ఉపయోగించి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ సర్వీస్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఇందుకోసం 9552300009 అనే నెంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపితే, మన మిత్ర సేవ ద్వారా తక్షణమే ఫలితాలను పొందవచ్చు.

ఈ సందర్భంగా మంత్రి లోకేష్, “ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. మీరు గడిపిన కష్టసాధ్యమైన రోజు కచ్చితంగా ఫలించాలి. రేపటి ఫలితాలు మీ ఉజ్వల భవిష్యత్తుకు మార్గం కావాలని ఆశిస్తున్నాను” అని ట్వీట్ చేశారు. విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవడంలో ఈ ఫలితాలు కీలకమైన మైలురాయి అవుతాయని భావిస్తున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం అంతా ఆసక్తిగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. క్రమశిక్షణ, సమయం పట్ల నిబద్ధతతో చదివిన విద్యార్థులకు ఇది విజయం సాధించే సమయం. అన్ని విద్యార్థులకు శుభాకాంక్షలు! మీ కృషికి న్యాయం జరిగి, మంచి ఫలితాల ద్వారా భవిష్యత్తు ద్వారాలు తెరుచుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిద్దాం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి