- Telugu News Photo Gallery Cinema photos Karthika Deepam 2 Serial Fame Jyosthna Alias Gayatri Simhadri Latest Photos Goes Viral
Tollywood: ఈ హాట్ బ్యూటీ ఆ సీరియల్లో పవర్ ఫుల్ విలనా.. ? హీరోయిన్లను మించిన క్రేజ్..
బుల్లితెరపై దూసుకుపోతున్న ఓ టాప్ సీరియల్లో ఆమె పవర్ ఫుల్ విలన్. ట్రెండీ లుక్లో కనిపిస్తూనే అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది. అతి తక్కువ సమయంలోనే తెలుగు ఫ్యామిలీ అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. కానీ ఈ వయ్యారికి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది.
Updated on: Apr 11, 2025 | 11:56 AM

సాధారణంగా కొందరు అమ్మాయిలు సీరియల్స్ ద్వారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటారు. హీరోయిన్స్ కంటే ఎక్కువగా సీరియల్ తారలే అటు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. అందులో ఈ అమ్మడు ఒకరు.

తనే కార్తీక దీపం 2 ఫేమ్ జ్యోత్స్న అలియాస్ గాయత్రి సింహాద్రి. ఈ సీరియల్లో పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. కానీ నెట్టింట మాత్రం ఈ అమ్మడు గ్లామర్ అరాచకం.

జ్యోత్స్న అసలు పేరు గాయత్రి సింహాద్రి. ఈ సీరియల్లో విలన్ పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేస్తుంది. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఇక నెట్టింట అందాలతో గత్తరలేపుతోంది.

ఇప్పటికే పల్లకిలో పెళ్లి కూతురు, త్రినయని సీరియల్స్ ద్వారా తెలుగు జనాలను అలరించింది. హీరోయిన్ కావాలనుకున్న గాయత్రి సింహాద్రి అనుకోకుండా సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే హీరోయిన్ గా కాకుండా విలన్ పాత్రలతోనే ఫేమస్ అయ్యింది.

ప్రస్తుతం కార్తీక దీపం 2 సీరియల్లో విలన్ పాత్రలో మెప్పిస్తుంది. అలాగే ఇటు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో నెటిజన్లను మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు ఫోటోను నెట్టింట తెగ వైరలవుతుంది




