Pakistan: అనుకోకుండా భారత్‌లో అడుగు పెట్టిన 3 ఏళ్ల పాక్ బాలుడు.. సురక్షితంగా తిరిగి అప్పగించిన ఇండియన్ ఆర్మీ

అనుకోకుండా సరిహద్దు దాటి భారత్‌ వైపునకు వచ్చి బాలుడిని పాకిస్థాన్ రేంజర్స్‌కు సద్భావన సూచనగా అప్పగించింది భారత భద్రతాదళం.

Pakistan: అనుకోకుండా భారత్‌లో అడుగు పెట్టిన 3 ఏళ్ల పాక్ బాలుడు.. సురక్షితంగా తిరిగి అప్పగించిన ఇండియన్ ఆర్మీ
3 Yr Old Pakistan Boy

Updated on: Jul 02, 2022 | 12:59 PM

Pakistan Boy: అనుకోకుండా అంతర్జాతీయ సరిహద్దుని దాటి.. భారత భూభాగంలోకి ప్రవేశించాడు పాకిస్థాన్ కు చెందిన  మూడేళ్ళ బాలుడు. భారత్ వైపు సరిహద్దు దాటిన 3 ఏళ్ల బాలుడిని తిరిగి పాకిస్థానీ రేంజర్‌లకు అప్పగించారు భారత ఆర్మీ అధికారులు. ఈ సంఘటన ఫిరోజ్‌పూర్ సెక్టార్‌లో జూలై 1 వ తేదీన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో భారత్-పాకిస్థాన్ సరిహద్దులో జీరో లైన్‌కు సమీపంలో కంచె దగ్గర ఒక పిల్లవాడు ఏడుస్తున్నట్లు భారత భద్రతాదళాలు గమనించాయి. వెంటనే BSF ఫీల్డ్ కమాండర్..  పాకిస్తాన్ రేంజర్స్‌తో ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించారు. అనుకోకుండా సరిహద్దు దాటి భారత్‌ వైపునకు వచ్చి బాలుడిని పాకిస్థాన్ రేంజర్స్‌కు సద్భావన సూచనగా అప్పగించింది భారత భద్రతాదళం. రాత్రి 7:15 గంటలకు పట్టుకున్నా బాలుడిని 9:45 గంటలకు తండ్రి సమక్షంలో పాక్ రేంజర్లకు అప్పగించినట్లు పంజాబ్ ఫ్రాంటియర్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..