Republic Day Parade 2023: వచ్చే రిపబ్లిక్ డే వేడుకలు చాలా స్పెషల్.. అలా ప్లాన్ చేస్తున్న బీఎస్ఎఫ్..

|

Dec 01, 2022 | 12:01 PM

రిపబ్లిక్ డే అనగానే చాలా మందికి గుర్తు వచ్చేది ఇండో-పాక్ అధికారిక సరిహద్దు వాఘా వద్ద ఇరు దేశాల సైనికులు చేసే విన్యాసాలే. అయితే ఇప్పటి వరకూ జరిగిన వాటి కంటే వచ్చే ఏడాది జరగనున్న..

Republic Day Parade 2023: వచ్చే రిపబ్లిక్ డే వేడుకలు చాలా స్పెషల్.. అలా ప్లాన్ చేస్తున్న బీఎస్ఎఫ్..
Bsf Camel Contingent
Follow us on

రిపబ్లిక్ డే అనగానే చాలా మందికి గుర్తు వచ్చేది రాజస్థాన్‌లోని ఇండో-పాక్ సరిహద్దు వద్ద ఇరు దేశాల సైనికులు చేసే విన్యాసాలే. అయితే ఇప్పటి వరకూ జరిగిన వాటి కంటే వచ్చే ఏడాది జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్‌లో సరికొత్త రకమైన విన్యాసాలను దేశ ప్రజలు చూడబోతున్నారు. అదేమిటంటే 2023లో జనవరి 26న జరిగే రిపబ్లిక్ పరేడ్‌లో మహిళలు మరోసారి కనిపించబోతున్నారు. అది కూడా ఒంటెలను స్వారీ చేస్తూ.. ఈ ఏడాది జరిగిన రిపబ్లిక్ డే పరేడ్‌లో భారత మహిళా బలగాలు మోటార్ బైకుల మీద చేసిన  విన్యాసాలను మన మంతా చూసి గర్వపడ్డాం. అలాంటి అవకాశం మరో సారి ఇవ్వనున్నట్టు ఓ ఉన్నతాధికారి తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 26న జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్‌లో పురుషులతో కలిసి బీఎస్‌ఎఫ్‌ మహిళలు కూడా తొలిసారిగా ఒంటెలపై స్వారీ చేస్తారని బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు.

58వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ‘‘1950లో తొలిసారిగా నిర్వహించిన వార్షిక కవాతులో పాల్గొంటున్న ఆర్మీకి చెందిన ఇదే తరహా స్క్వాడ్‌ను భర్తీ చేశారు. ఆ తర్వాత బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ నుంచి ఒంటెల బృందం 1976 నుంచి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉంది. ఇందులో సాయుధ బీఎప్ఎఫ్ సిబ్బంది, బ్యాండ్ కాంటెంజెంట్ సభ్యులు ఉంటారు. వారు ముందుగా రాజ్‌పథ్‌గా పిలిచే కర్తవ్య మార్గంలో కవాతు దళాన్ని అనుసరిస్తారు.తదుపరి రిపబ్లిక్ డే పరేడ్‌లో ఒంటెల బృందంలో సగం మంది సిబ్బంది మహిళలు ఉంటార’’ని ఆయన అన్నారు. వివిధ విధులు, వేడుకల్లో మన మహిళా సిబ్బంది పెరుగుతున్న పాత్రకు ఇది సూచిక అని ఆయన చెప్పారు.

దేశంలో ఒంటెలను ఆపరేషనల్, సెరిమోనియల్ విధులకు ఉపయోగించే ఏకైక శక్తి బీఎస్ఎఫ్. రాజస్థాన్‌లోని ఇండో-పాక్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి నడుస్తున్న థార్ ఎడారిలో పెట్రోలింగ్ కోసం ఈ సిబ్బంది ఒంటెలను ఉపయోగిస్తారు. ఈ బృందంలో సాధారణంగా 90 ఒంటెలు ఉంటాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాటించే సంప్రదాయం ప్రకారం.. ప్రధాన ఒంటె బృందం ఆకర్షణీయమైన దుస్తులు ధరించిన సాయుధ బీఎస్ఎఫ్ బలగాలు ప్రదర్శిస్తారు. ఇంకా అందమైన మల్టీకలర్ దుస్తులలో ఒంటెలపై స్వారీ చేస్తూ ,యుద్ధ సంగీతాన్ని ప్లే చేస్తూ బ్యాండ్‌ వాయించేవారిని బీఎస్ఎఫ్ బలగాలు అనుసరిస్తారు. కాగా, జనవరి 29న అంటే.. రిపబ్లిక్ డేకు మూడు రోజుల తర్వాత నిర్వహించే బీటింగ్ ది రిట్రీట్ వేడుకలో ఈ బృందం కూడా ఒక భాగం.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..