PM Modi: ప్రధాని నరేంద్ర మోడీకి నోబెల్ బహుమతి ఇవ్వాలంటోన్న బీఎస్ఈ చీఫ్.. ఎందుకో తెలుసా?
కొవిడ్ మహమ్మారి కాలంలో ఉచిత రేషన్ పథకంతో కోట్లాది మంది పేదల కడుపు నింపిన ప్రధాని నరేంద్ర మోడీ (PM NarendraModi) నోబెల్ బహుమతి ఇవ్వాలని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ చీఫ్ ఆశిష్ కుమార్ చౌహాన్ (Ashishkumar Chauhan) అభిప్రాయపడ్డారు.
కొవిడ్ మహమ్మారి కాలంలో ఉచిత రేషన్ పథకంతో కోట్లాది మంది పేదల కడుపు నింపిన ప్రధాని నరేంద్ర మోడీ (PM NarendraModi) నోబెల్ బహుమతి ఇవ్వాలని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ చీఫ్ ఆశిష్ కుమార్ చౌహాన్ (Ashishkumar Chauhan) అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో అతిపెద్ద ఉచిత ఆహార పథకాన్ని విజయవంతంగా అమలుచేసిన మోడీ ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి అన్ని విధాలా అర్హుడని ఆశిష్ తెలిపారు. ఐఐఎం- కలకత్తాలో జరిగిన విద్యార్థుల కాన్వొకేషన్ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ కరోనా మహమ్మారి కాలంలో సుమారు 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ పథకాన్ని విజయవంతంగా అమలు చేశారు ప్రధాని మోడీ. మిగతా దేశాలతో పోల్చితే ఈ సంఖ్య చాలా ఎక్కువ. ఇందులో 14 శాతం మందికి మాత్రమే అంటే కేవలం11.5 కోట్ల మందికి ఉచిత ఆహారం అందించినందుకు ఐక్యరాజ్యసమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ (WFP)కి 2020లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. మరి ఉచిత రేషన్ పథకాన్ని మరింత అద్భుతంగా నిర్వహించి కోట్లాది మంది కడుపునింపిన మోడీని అభినందించాల్సిందే. ఆయన నోబెల్ పురస్కారానికి అన్ని విధాలా అర్హుడు. మోడీతో పాటు సామాజిక కార్యకర్తలు, వైద్యులు, ఇతర ఫ్రంట్‌లైన్ల వర్కర్ల సహాయంతో భారతదేశం కొవిడ్ సంక్షోభాన్ని సమర్థంగా అధిగమించింది’ అని BSE చీఫ్ పేర్కొన్నారు.
కాగా కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభం కారణంగా ప్రజలెవరూ ఆకలితో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన(PMGKAY) పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. 2020 ఏప్రిల్ నుంచి మొదలైన ఈ ఉచిత రేషన్ పంపిణీ పథకాన్ని కేంద్రం దశల వారీగా పొడిగిస్తూ వస్తోంది. ఈ పథకం కింద అర్హులైన ప్రతిఒక్కరికీ నెలకు అదనంగా 5కిలోల చొప్పున ఆహార ధాన్యాలను కేంద్రం పంపిణీ చేస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: