Brahmarshi Patriji: ప్రముఖ పిరమిడ్ ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ (74) ఆదివారం మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా మూత్రపిండాలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురి కాగా బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చేర్పించి చికిత్సను అందించారు. అయితే రెండు రోజుల నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కడ్తాల్‌లోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ ధ్యాన కేంద్రానికి తరలించారు ట్రస్ట్ సభ్యులు. ఆదివారం సాయంత్రం ఆయన తుది శ్వాస విడిచారు. సోవారం సాయంత్రం ఐదు గంటలకు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ట్రస్ట్ సభ్యులు వెల్లడించారు. అంత్యక్రియలకు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి పిరమిడ్ ధ్యాన మండలి సభ్యులు తరలి రావాలని కోరారు.
కాగా, పత్రిజీ నిజామాబాద్‌లోని బోధన్‌లో జన్మించారు. గతంలో కర్నూలు జిల్లాలో కోరమాండల్ ఫెర్టిలైజర్ కంపెనీలో ఉద్యోగిగా పని చేశారు. 2012లో కడ్తాల్ మండలం అన్మాసుపల్లిలో ప్రపంచంలోనే అతిపెద్ద కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్‌ను నిర్మించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..