కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు.. కేజీఎఫ్ చాఫ్టర్-2 సినిమా సెగ తగిలింది. కేజీఎఫ్ చిత్రంలోని పాటలు, మ్యూజిక్‌ను అక్రమంగా వినియోగించుకున్నారన్న కేసుపై బెంగళూరు కోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడటం, నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడిన కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేయాలంటూ ట్విట్టర్‌ను ఆదేశించింది. కాంగ్రెస్ పార్టీతోపాటు భారత్ జోడో యాత్ర, రాహుల్, జైరాం రమేష్, సుప్రియ ట్విట్టర్ ఖాతాలను తాత్కాలికంగా బ్లాక్ చేయాలని బెంగుళూరు కోర్టు ఆదేశించింది.
MRT సంస్థకి సంబందించిన KGF 2 చిత్రంలోని పాటలను కాంగ్రెస్ అనుమతి లేకుండా తమ క్యాంపెయిన్‌కి వాడుకొందని ఆ సంస్థ ఇటీవల ఫిర్యాదు చేసింది. ఎంఆర్‌టి సంస్థ ఫిర్యాదు చేయడంతో రాహుల్ గాంధీ, జైరామ్ రమేష్, సుప్రియా శ్రీనతేలపై యశ్వంత్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. దీనిపై విచారించిన బెంగళూరు కోర్టు.. మ్యూజిక్ కాపీరైట్ కేసు కింద కాంగ్రెస్ పార్టీతోపాటు భారత్ జోడో యాత్ర ట్విట్టర్ హ్యాండిల్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేయాలని బెంగళూరు కోర్టు ట్విట్టర్‌ని ఆదేశించింది.
కాగా.. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. తమకు అధికారికంగా ఏటువంటి కోర్టు ఆర్డర్ రాలేదని, సోషల్ మీడియాలో మాత్రమే దీనికి సంబంధించిన వార్తలు చూస్తున్నాం అంటూ జవాబిచ్చింది.
రాహుల్ భారత్ జోడో యాత్ర ఇప్పటివరకు కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పూర్తి చేసుకుని.. మహారాష్ట్రలోకి ప్రవేశించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..