Supreme Court: గ్యాంగ్‌రేప్ అండ్ మర్డర్ కేసులో సంచలన తీర్పిచ్చిన సుప్రీంకోర్ట్.. ఉరిశిక్ష పడిన దోషులను..
దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించిన ఢిల్లీ గ్యాంగ్‌రేప్ అండ్ మర్డర్ కేసులో సంచలన తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఉరిశిక్ష పడిన దోషులను నిర్దోషులుగా ప్రకటించింది.
వంద మంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదు-కానీ, ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదనేది భారత న్యాయవ్యవస్థ నినాదం. అంటే, ఒక్క నిర్దోషి కూడా అన్యాయంగా బాధింపకూడదు అనేదే మన విధానం. భారత న్యాయవ్యవస్థ ప్రాథమిక సూత్రాన్ని మరోసారి గుర్తుచేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం. పదేళ్లక్రితం దేశ రాజధానిలో సెన్షేషన్ సృష్టించిన చావ్లా గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ కేసులో సంచలన తీర్పు ఇచ్చింది. ముగ్గురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్‌ను కొట్టివేసింది. పైగా ఆ ముగ్గురినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది సర్వోన్నత న్యాయస్థానం.
2012లో 19ఏళ్ల యువతి గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్‌కి గురైంది. సామూహిక అత్యాచారంచేసి అత్యంత పాశవికంగా చిత్రహింసలు పెట్టి చంపేశారు కామాంధులు. ఉత్తరాఖండ్‌కి చెందిన రవికుమార్, రాహుల్, వినోద్ కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేల్చారు పోలీసులు. ఈ కేసులో ముగ్గురినీ దోషులుగా తేల్చిన ట్రయల్ కోర్ట్.. 2014లో మరణశిక్ష విధించింది. తీర్పును సవాలు చేయడంతో ఢిల్లీ హైకోర్టు కూడా ట్రయల్ కోర్టు జడ్జిమెంట్‌నే సమర్ధించింది. దాంతో, దోషులు… సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసును విచారించిన సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. ఉరిశిక్షను రద్దు చేయడమే కాకుండా ముగ్గురు దోషులను నిర్దోషులుగా ప్రకటించింది. అయితే, సుప్రీం తీర్పుపై ఆవేదన వ్యక్తంచేసింది బాధిత కుటుంబం. న్యాయపోరాటం కొనసాగిస్తామని తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..