Blast At Shivakashi: శివకాశిలోని బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు, ఆరుగురి మృతి, పలువురికి గాయాలు
తమిళనాడు శివకాశి సమీపంలోని కాళైయ్యర్ కురిచ్చి లో గల ప్రైవేటు బాణాసంచా ఫ్యాక్టరీలో గురువారం జరిగిన పేలుడులో ఆరుగురు మరణించగా..
Blast At Shivakashi:తమిళనాడు శివకాశి సమీపంలోని కాళైయ్యర్ కురిచ్చి లో గల ప్రైవేటు బాణాసంచా ఫ్యాక్టరీలో గురువారం జరిగిన పేలుడులో ఆరుగురు మరణించగా పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో 10 కి పైగా గదులు నేలమట్టమయ్యాయి. పేలుడు ధాటికి సమీపంలో పని చేస్తున్న 6 గురి శరీరాలు కాలిపోయి గుర్తు పట్టలేని విధంగా మారాయి. రెండు వారాల్లో ఇక్కడ ఈ విధమైన ఘటన జరగడం ఇది రెండో సారి. ఫైరింజన్లు మంటలను ఆర్పడానికి తీవ్రంగా శ్రమించాయి. ..కాగా ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read:
Nirav Modi: లండన్ వీధుల్లో తిరిగిన నీరవ్ మోడీ, ఇక ఇండియాకు రాక తప్పదు, త్వరలో అప్పగింతకు సన్నాహాలు