Tejasvi Surya: ఎంపీ అంటే ఇలా ఉండాలి.. దెబ్బకు ప్రధాని మోదీయే ఫిదా.!

తేజస్వి సూర్య ఐరన్‌మ్యాన్ 70.3 ట్రయాథ్లాన్ ఛాలెంజ్‌ను పూర్తి చేసిన మొదటి పార్లమెంటేరియన్‌గా నిలిచారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ 'ఫిట్ ఇండియా' చొరవను ఛాలెంజ్‌ని స్వీకరించడానికి ఈ యంగ్ ఎంపీ ముందుకు వచ్చాడు. ఐరన్‌మ్యాన్ 70.3 గోవా ఈవెంట్, సుందరమైన మిరామార్ బీచ్‌లో జరిగింది. ఇందులో 57 దేశాల నుండి 1,200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

Tejasvi Surya: ఎంపీ అంటే ఇలా ఉండాలి.. దెబ్బకు ప్రధాని మోదీయే ఫిదా.!
Bjp Leader Tejasvi Surya
Follow us

|

Updated on: Oct 28, 2024 | 12:45 PM

గోవాలో జరిగిన ఐరన్‌మ్యాన్ 70.3 ట్రయాథ్లాన్ ఛాలెంజ్‌ను పూర్తి చేసిన తొలి పార్లమెంటేరియన్‌గా బీజేపీ నేత, బెంగళూరు సౌత్‌కు చెందిన లోక్‌సభ ఎంపీ తేజస్వి సూర్య ఆదివారం నిలిచారు. ఈ ఈవెంట్‌లో 1.9 కిమీ ఈత, 90 కిమీ సైక్లింగ్, 21.1 కిమీ పరుగులో ఆయన పాల్గొన్నారు. ఈ ఘనత సాధించడానికి తనకు నాలుగు నెలలు శ్రమించినట్లు ఎంపీ తెలిపారు.

తన ఫీట్ భారతీయ యువకులను ఫిట్‌నెస్ లక్ష్యాలను సాధించేలా ప్రోత్సహిస్తుందని ఆశిస్తున్నానట్లు ఆయన ట్విట్ చేశారు. ఈ విషయంపై ప్రధాని మోదీ కూడా ప్రశంసించాడు. “ఫిట్‌నెస్-సంబంధిత కార్యకలాపాలను కొనసాగించడానికి ఇది చాలా మంది యువకులకు స్ఫూర్తినిస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.” అని ఆయన తేజస్వి సూర్య ప్రశంసిస్తూ ట్విట్ చేశాడు.

ఎంపీ తేజస్వి సూర్యను ప్రశంసిస్తూ ప్రధాని మోదీ చేసిన ట్విట్:

2022 రిలే ఈవెంట్‌లో, సూర్య 90 కిమీ సైక్లింగ్ సెగ్మెంట్‌ను పూర్తి చేశాడు. ఇది ఐరన్‌మ్యాన్ ఎంట్రీ ఇచ్చాడు.  అతను మొత్తం ఈవెంట్‌ను 8 గంటల 27 నిమిషాల 32 సెకన్లలో పూర్తి చేశాడు. ఐరన్‌మ్యాన్ 70.3 గోవాలో పురుషుల టైటిల్‌ను ఇండియన్ ఆర్మీకి చెందిన బిశ్వర్జిత్ సాయిఖోమ్ 4 గంటల, 32 నిమిషాల 4 సెకన్ల వ్యక్తిగత అత్యుత్తమ సమయంతో రేసును పూర్తి చేశాడు. మహిళల విభాగంలో ఈజిప్ట్ క్రీడాకారిణి యాస్మిన్ హలావా 5 గంటల 22 నిమిషాల 50 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!