AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ప్రధాని మోడీ ప్రజా సేవకు అంకితమై ఇరవై యేళ్లు.. అక్టోబర్ 7న పెద్ద ఎత్తున సంబరాలకు సిద్ధమైన బీజేపీ

BJP to celebrate on October 7: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రజా సేవకు అంకితమై రెండు దశాబ్ధాలు పూర్తైన సందర్భంగా ఘనంగా సంబరాలు జరుపుకోవాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది.

PM Modi: ప్రధాని మోడీ ప్రజా సేవకు అంకితమై ఇరవై యేళ్లు.. అక్టోబర్ 7న పెద్ద ఎత్తున సంబరాలకు సిద్ధమైన బీజేపీ
Pm Modi
Balaraju Goud
|

Updated on: Oct 04, 2021 | 6:15 PM

Share

BJP to celebrate on October 7:  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రజా సేవకు అంకితమై రెండు దశాబ్ధాలు పూర్తైన సందర్భంగా ఘనంగా సంబరాలు జరుపుకోవాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఇరవై యేళ్లుగా నిరంతర ప్రజాసేవ చేస్తున్న సందర్భంగా ఈ వేడుకలను జరుపుకోవడానికి సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా అక్టోబర్ 7న భారతీయ పార్టీ తరుఫున పెద్ద కార్యక్రమాలు నిర్వహించేందుకు రెడీ అవుతోంది. పార్టీ కార్యకర్తలు నదులను శుభ్రపరచడం, ఇతర సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించింది. అలాగే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గురించి ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు. ప్రతి బూత్ స్థాయిలో పార్టీ కార్యకర్తలు ప్రజలకు మోడీ విధానాల గురించి అవగాహన కల్పిస్తారని బిజెపి వర్గాలు వెల్లడించాయి.

అక్టోబర్ 7న స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా దేశంలోని నదులను శుభ్రం చేయడం జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ బృహత్తర కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్యనేతలు.. తమతమ నియోజకవర్గాలలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే, “దేశవ్యాప్తంగా గురుద్వారాలు ప్రధాని మోడీ దీర్ఘాయుష్షు కోసం ‘అర్దాస్’ నిర్వహిస్తారు. ‘సేవ సమర్పణ’లో భాగంగా లాంగర్ నిర్వహించనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 71 వ జయంతిని పురస్కరించుకుని దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అనేక సిక్కు కమిటీలు ఈ ఉత్సవాలను ప్రారంభించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సెప్టెంబరు 17న పురస్కరించుకుని.. గత నెలలో ‘సేవా సప్తాహ్’ పేరుతో సేవా వారోత్సవాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సెప్టెంబరు 14 నుంచి 20 వరకు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ దేశంలోని ప్రతి వ్యక్తి ప్రభుత్వ అభివృద్ధి పనుల నుండి లబ్ధిపొందాలనే దృక్పథం ప్రధానమంత్రికి ఉందని బిజెపి చీఫ్ చెప్పారు.

మరోవైపు, అక్టోబర్ 7వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించే అవకాశం ఉంది. ప్రధాని మోడీ తన పదవీ కాలంలో దేవాలయాన్ని సందర్శించడం ఇది రెండోసారి. 2019 లో చివరిసారిగా ఆయన కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు. అదే సమయంలో, ఉత్తరాఖండ్ మరో నాలుగు రాష్ట్రాలతో పాటు ఫిబ్రవరి 2022 లో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైంది. అలాగే అదేరోజున ప్రత్యేకించి, రక్షణ దళాలలో సభ్యులుగా పనిచేస్తున్న , సేవ చేస్తున్న కుటుంబాలను కలుసుకునేందుకు ప్రధాని మోడీ కసరత్తు చేస్తున్నారు.

Read Also…  Breaking: మూసీ నదిలో గల్లంతైన జహంగీర్ మృతదేహం లభ్యం.. 10 ఏళ్ల క్రితం తండ్రి కూడా ఇలాగే

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా