Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోన్న ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో బీజేపీ..

|

Dec 03, 2023 | 9:30 AM

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఇప్పటి వరకూ బీజేపీ 138 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ 89 స్థానాల్లో కొనసాగుతోంది. ఇతరులు ఒక స్థానంలో కొనసాగుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ లో చెప్పిన విధంగానే మధ్యప్రదేశ్‌లో బీజేపీ జోరుకొనసాగుతోంది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని దిగ్విజయ్ సింగ్ మీడియా ముందు తెలిపారు. మధ్యప్రదేశ్‌లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 230 కాగా మ్యాజిక్ ఫిగర్ 116 రావాలి.

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోన్న ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో బీజేపీ..
Bjp Continues To Lead In Madhya Pradesh Assembly Election Counting
Follow us on

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఇప్పటి వరకూ బీజేపీ 138 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ 89 స్థానాల్లో కొనసాగుతోంది. ఇతరులు ఒక స్థానంలో కొనసాగుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ లో చెప్పిన విధంగానే మధ్యప్రదేశ్‌లో బీజేపీ జోరుకొనసాగుతోంది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని దిగ్విజయ్ సింగ్ మీడియా ముందు తెలిపారు. మధ్యప్రదేశ్‌లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 230 కాగా మ్యాజిక్ ఫిగర్ 116 రావాలి. ఇవి ఉదయం వెల్లడైన మొదటి ట్రెండ్ ఫలితాలు మాత్రమే. పూర్తి స్థాయి ఫలితం వెలువడాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడాలి.

మధ్యప్రదేశ్‌లో 52జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ జరుగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు ఎన్నికల అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 2,533 మంది అభ్యర్థులు పోటీలో దిగగా ఎవరు గెలుస్తారన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకూ వెల్లడైన ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ గెలిచే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. మరి కొన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు విజయావకాశాలు అధికంగా ఉన్నట్లు చూపించాయి. రెండో సారి కూడా తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ధీమా వ్యక్తం చేశారు. అయితే ప్రజలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారని మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..