మేఘాలయ తరహ మర్డర్..! అడ్డుగా ఉన్న భర్తను మట్టుబెట్టింది.. ఈసారి ఎక్కడంటే.?
మేఘాలయ హనీమూన్ మర్డర్ సీన్ గుర్తుంది కదా. యాజిటీజ్ అట్టాంటి సీనే.. బీహార్‌లో రిపీట్ అయింది. ప్రేమ.. పెళ్లి.. హత్య.. కారణం.. ఇల్లీగల్ ఎఫైర్. అక్కడ రాజా రఘువంశీ హతమైనట్టే ఇక్కడ మరో వ్యక్తి కనుమరుగయ్యాడు. భార్యే సర్వస్వం అనుకున్నాడతను. ఆమె కోసం చెమటోడ్చి పనిచేశాడు. పైసా పైసా కూడబెట్టాడు. పతి ఇంత చేస్తే.. పత్ని చేసిందేంటి?

మేఘాలయ హనీమూన్ మర్డర్ సీన్ గుర్తుంది కదా. యాజిటీజ్ అట్టాంటి సీనే.. బీహార్‌లో రిపీట్ అయింది. ప్రేమ.. పెళ్లి.. హత్య.. కారణం.. ఇల్లీగల్ ఎఫైర్. అక్కడ రాజా రఘువంశీ హతమైనట్టే ఇక్కడ మరో వ్యక్తి కనుమరుగయ్యాడు. భార్యే సర్వస్వం అనుకున్నాడతను. ఆమె కోసం చెమటోడ్చి పనిచేశాడు. పైసా పైసా కూడబెట్టాడు. పతి ఇంత చేస్తే.. పత్ని చేసిందేంటి? ఆమె చేసిన నిర్వాకంతో సభ్య సమాజం షాకయింది. భర్తను గొంతు కోసి చంపింది. అయితే ఫ్లాన్ అంతా రివర్స్ కావడంతో ఆమెతోపాటు ఆమె ప్రియుడు కటకటాలపాలయ్యారు. అయితే ఎనిమిదేళ్ల వివాహేతర సంబంధం బయటపడటమే ఈ నేరానికి కారణమని పోలీసులు చెబుతున్నారు.
బీహార్‌లోని రోహ్తాస్ జిల్లాలోని డెహ్రీ పట్టణంలో జరిగిన అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రోహ్తాస్ పోలీస్ సూపరింటెండెంట్ రోషన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ఆ మహిళ భర్త ఇటీవలే ఆమెకు వేరే వ్యక్తితో సంబంధం ఉందని గుర్తించాడు. ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, వారి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చాడు. దీంతో రెండు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
ఘర్షణ, అవమానంగా భావించిన ఆ మహిళ, ఆమె ప్రియుడితో కలిసి తన భర్తను చంపడానికి కుట్ర పన్నారని పోలీసులు తెలిపారు. కోల్‌కతాలో నివసిస్తున్న ఆమె ప్రియుడు జూన్ 22 రాత్రి తన సహచరుడితో కలిసి డెహ్రీకి తిరిగి వచ్చాడు. ఆ సాయంత్రం, కుటుంబం పడుకున్న తర్వాత, ఆ మహిళ ఇద్దరినీ ఇంట్లోకి అనుమతించింది. తన గదిలో భర్తను గొంతు కోసి చంపిందని పోలీసులు వెల్లడించారు.
ఈ సంఘటన జరిగిన సమయంలో పక్క గదిలో నిద్రిస్తున్న దంపతుల కుమారుడు మేల్కొని పోలీసులకు సమాచారం అందించాడు. నిందితులు పారిపోవడానికి ప్రయత్నించగా, వారిలో ఒకరు పైకప్పు నుండి దూకి తప్పించుకోలేకపోయారు. స్థానికులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు ముగ్గురు నిందితులు మహిళతోపాటు ఆమె ప్రియుడు, అతని సహచరుడిని సంఘటన స్థలంలో అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని రోహ్తాస్ పోలీస్ సూపరింటెండెంట్ రోషన్ కుమార్ తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



