AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ప్లీజ్ నాన్న భయమేస్తోంది.! అమ్మను వదిలేయ్..’ షాకింగ్ వీడియో.. చూస్తే కన్నీళ్లే!

వరకట్న దాహం మరో అబల ప్రాణాలను బలిగొంది. బీహార్‌లో వెలుగు చూసిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. గయా జిల్లాలోని జనక్‌పూర్ ప్రాంతంలో నిషా కుమారి అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమె తండ్రి శ్రవణ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో భర్త అభిషేక్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

'ప్లీజ్ నాన్న భయమేస్తోంది.! అమ్మను వదిలేయ్..' షాకింగ్ వీడియో.. చూస్తే కన్నీళ్లే!
Viral Video
Balaraju Goud
|

Updated on: Jun 25, 2025 | 6:01 PM

Share

వరకట్న దాహం మరో అబల ప్రాణాలను బలిగొంది. బీహార్‌లో వెలుగు చూసిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. గయా జిల్లాలోని జనక్‌పూర్ ప్రాంతంలో నిషా కుమారి అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమె తండ్రి శ్రవణ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో భర్త అభిషేక్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే బిడ్డల కళ్ల ముందే, తల్లిని కొడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జనక్‌పూర్ మొహల్లాకు చెంది నిషా కుమారి, జూన్ 16 రాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమె భర్త అభిషేక్ నిత్యం వరకట్నం కోసం వేధింపులకు పాల్పడ్డాడని, ఈ క్రమంలో హత్య చేశాడని నిషా తండ్రి ఆరోపించారు. 2015లో వివాహమైన నాటి నుంచి నిషా వేధింపులకు గురవుతోందన్నారు. ఇద్దరు కుమార్తెలు పుట్టిన తర్వాత ఈ వేధింపులు మరింత ఎక్కువయ్యాయని నిషా తండ్రి శ్రవణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అభిషేక్ కుటుంబం క్రమం తప్పకుండా రూ. 20,000 నుండి రూ. 50,000 వరకు డబ్బు డిమాండ్ చేసేవారని శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ బాధాకరమైన వీడియో, అభిషేక్ కర్కశత్వాన్ని బట్టబయలు చేసింది. ఈ వీడియోలో బాధలో ఉన్న పిల్లల ముందు నిషాను హింసాత్మకంగా కొడుతున్నట్లు కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

వరకట్నం డిమాండ్ చేసినందుకు ఆమె భర్త అభిషేక్ కుమార్, అత్తమామలు ఆమెను చంపారని మృతురాలి కుటుంబం ఆరోపిస్తోంది. నిషా నలంద జిల్లాలోని లాహేరి పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని మయూరి మొహల్లా నివాసి. 2015 సంవత్సరంలో, ఆమె హిందూ ఆచారాల ప్రకారం అభిషేక్‌ను వివాహం చేసుకుంది. వివాహం తర్వాత, ఇద్దరు కుమార్తెలు జన్మించారు. దీని తరువాత, అత్తమామలు వరకట్నం కోసం నిత్యం వేధింపులకు పాల్పడ్డారు. ఈ క్రమంలోనే జూన్ 17న ఆపస్మారకస్థితిలో ఉన్న ఆమెను గయాలోని ANMMCH ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆమె చనిపోయిందని ప్రకటించారు. మృతురాలి కుటుంబం ముఫాసిల్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. భర్త భార్యను దారుణంగా కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, పిల్లలు అతన్ని ఆపమని వేడుకుంటున్నారు.

వీడియో చూడండి.. 

అయితే అభిషేక్ మాత్రం, నిషా విషం సేవించి ఆత్మహత్య చేసుకుందని, తనకు సమాచారం వచ్చినప్పుడు తాను పాట్నాలో ఉన్నానని అభిషేక్ చెబుతున్నాడు. ఆ తరువాత ఆమె చికిత్స పొందుతూ మరణించిందన్నాడు. అభిషేక్, అతని కుటుంబ సభ్యులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, నిషా మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపారు. వైరల్ వీడియో ప్రజల ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..