AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రియురాలి మోజులో ఘాతుకం.. రెండో భార్యపై పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టిన భర్త..కట్‌చేస్తే..

ప్రియురాలిని వివాహం చేసుకోవాలనే దురుద్దేశంతో వికాస్ కుమార్ అనే వ్యక్తి తన రెండో భార్య సునీతా దేవిని పెట్రోల్ పోసి నిప్పు పెట్టి దారుణంగా హత్య చేశాడు. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిందితుడు వికాస్ కుమార్ ఐదు సంవత్సరాల క్రితం సునీతా దేవిని (25) వివాహం చేసుకున్నాడు.

ప్రియురాలి మోజులో ఘాతుకం.. రెండో భార్యపై పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టిన భర్త..కట్‌చేస్తే..
Husband Kills Wife with Petrol
Jyothi Gadda
|

Updated on: Oct 12, 2025 | 11:24 AM

Share

ప్రియురాలిని వివాహం చేసుకోవాలనే పక్కా ప్లాన్‌తో ఓ వ్యక్తి తన తన రెండవ భార్యకు నిప్పంటించాడు. ఈ దారుణ ఘటన బీహార్‌లోని నలంద జిల్లాలో జరిగింది. ప్రియురాలిని వివాహం చేసుకోవాలనే దురుద్దేశంతో వికాస్ కుమార్ అనే వ్యక్తి తన రెండో భార్య సునీతా దేవిని పెట్రోల్ పోసి నిప్పు పెట్టి దారుణంగా హత్య చేశాడు. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిందితుడు వికాస్ కుమార్ ఐదు సంవత్సరాల క్రితం సునీతా దేవిని (25) వివాహం చేసుకున్నాడు.

అయితే, సునీత తండ్రి ప్రకారం, తన కూతురితో వివాహం జరిగిన తర్వాతే వికాస్‌ కుమార్‌కు ఇప్పటికే ఒకసారి వివాహం అయిందని, అతను తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదని తెలిసిందన్నారను. దాంతో కుమార్ కుటుంబం సునీతను తమతోనే ఉండమని ఒప్పించింది. కానీ, అందుకు ఆమె అంగీకరించలేదు. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇద్దరూ పుట్టిన కొద్దికాలానికే మరణించారు. ఈ క్రమంలోనే కుమార్ తన స్నేహితురాలిని వివాహం చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేశాడు. దీంతో ఇద్దరి మధ్య తరచుగా గొడవలు చెలరేగాయి. చివరికి సునీత అతన్ని వదిలి తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వెళ్ళింది.

అయితే, గత నెల, దుర్గా పూజ పండుగకు ముందు కుమార్ సునీత ఇంటికి వెళ్లి ఆమెను తనతో తిరిగి రమ్మని కోరాడు. భర్త మాటలు నమ్మిన సునీత అతనితో పా టు వచ్చింది. శనివారం తెల్లవారుజామున 1 గంటల ప్రాంతంలో సునీత నుండి తమకు ఫోన్ వచ్చిందని, కుమార్ తనపై పెట్రోల్ పోసి ప్రాంగణంలో బంధించాడని, ఆ తర్వాత గ్యాస్ స్టవ్ వాల్వ్‌లను తెరిచి, వెలిగించిన అగ్గిపుల్ల విసిరి ఆమెను తగలబెట్టాడని సునీత సోదరుడు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం భర్త, అత్తమామలు పరారీలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..