AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nitish Kumar: ఢిల్లీ పర్యటనలో బీహార్ సీఏం బిజీబిజీ.. విపక్షాల ప్రధాని అభ్యర్థిత్వంపై నితీష్ కుమార్ ఏమన్నారంటే..

బీజేపీతో దోస్తికి కటీఫ్ చెప్పి ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన తర్వాత తొలిసారి నితీష్ కుమార్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. తన ఢిల్లీ పర్యటనలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కలుసుకున్నారు. ఈసందర్భంగా విపక్షాల ప్రధాని అభ్యర్థిత్వంపై స్పందింస్తూ..

Nitish Kumar: ఢిల్లీ పర్యటనలో బీహార్ సీఏం బిజీబిజీ.. విపక్షాల ప్రధాని అభ్యర్థిత్వంపై నితీష్ కుమార్ ఏమన్నారంటే..
Nitish Kumar, Arvind Kejriw
Amarnadh Daneti
|

Updated on: Sep 06, 2022 | 3:54 PM

Share

Nitish Kumar: విపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థి అంశం మరో సారి చర్చనీయాంశమైంది. ఆపదవిపై తనకు ఆశ లేదని నితీష్ కుమార్ అంటున్నప్పటికి.. రాజకీయంగా ఆయన వేస్తున్న అడుగులు మాత్రం ఢిల్లీకి ప్రమోషన్ కోసమే అనే సంకేతాలు ఇస్తున్నాయి. వాస్తవానికి సుదీర్ఘకాలం బీహార్ సీఏంగా నితీష్ కుమార్ కొనసాగుతున్నారు. ఈక్రమంలో 2014కు ముందు జాతీయ రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఎలాగైనా బీహార్ దాటి ఢిల్లీ వెళ్లాలనే యోచనలో నితీష్ కుమార్ ఉన్నట్లు ఆయన ఆలోచనలు బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం విపక్షపార్టీలన్నీ ఐక్యంగా లేవు. విపక్షాలను ఏకం చేసేందుకు కాంగ్రెస్ (Congress) చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతూ వస్తున్నాయి. మరోవైపు కేంద్రంలోని నరేంద్రమోదీ (Narendra Modi) ప్రభుత్వం ఇప్పటికే 8ఏళ్ల పదవీకాలం పూర్తిచేసుకుంది. మరో రెండేళ్ల గడువు ఉంది. వరుసగా రెండు సార్లు ఎన్నికల్లో గెలుస్తూ వచ్చిన బీజేపీ(BJP) ఈసారి కొంతమేర ప్రజావ్యతిరేకతను ఎదుర్కొనే అవకాశం ఉందనే అంచనాతో.. నితీష్ కుమార్ తాను ఏన్డీయేలో ఉంటే ఎప్పటికి ప్రధానమంత్రి కాలేననే విపక్షాలను ఏకం చేస్తే ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి పోటీపడవచ్చనే ఆలోచనతోనే ఆయన బీహార్ లో బీజేపీతో దోస్తికి కటీఫ్ చెప్పి ఉండవచ్చనేది రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. మరోవైపు విపక్షాల తరపున ప్రధానమంత్రి అభ్యర్థిని తాను కాదని నితీష్ కుమార్ చెబుతున్నప్పటికి.. రాజకీయంగా కొంత అవగాహన ఉన్న ఎవరికైనా ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిత్వంపై ఆసక్తి చూపిస్తున్నారనే విషయం అర్థమవుతుంది. ఇప్పటికిప్పుడు తాను విపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిని అని ఓపెన్ అయితే.. కేవలం రాజకీయ స్వార్థ ప్రయోజనాలు, పదవీ వ్యామోహంతోనే బీజేపీతో పొత్తును తెంచుకున్నారనే సంకేతాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే నీతిష్ ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు.

ఎన్నికల సమయం దగ్గరపడేకొద్ది.. అన్ని పార్టీల అభ్యర్థనే మేరకే తాను ఒప్పుకోవల్సి వచ్చిందని నితీష్ కుమార్ చెప్పడానికి అవకాశం ఉంది. ఇదంతా రాజకీయం. మరోవైపు తాజా పరిస్థితులు చూస్తున్నా.. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్ తో సహా విపక్ష పార్టీలన్నింటిని ఐక్యం చేయడమే ఆయన టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎంత వరకు సఫలమవుతారనేది భవిష్యత్తులో తేలనుంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఏం అరవింద్ కేజ్రీవాల్ కూడా జాతీయ రాజకీయాల్లో సొంతంగా ఎదగాలనే ప్లాన్ లో ఉన్నారు. ఒకవేళ అన్ని పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడితే.. తాను ఒంటరిగా ఎదగడానికి అవకాశం ఉండకపోవచ్చనే ఆలోచనలో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నట్లు తెలుస్తోంది. తాత్కాలిక ప్రయోజనాల కోసం కూటమిలో చేరితే భవిష్యత్తులో తన పార్టీ ఎదుగుదలకు నష్టం ఏర్పడవచ్చనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఉన్న కూటమికి అరవింద్ కేజ్రీవాల్ దూరంగా ఉండే అవకాశం లేకపోలేదు. ఇదే సమయంలో ఢిల్లీ సీఏం అరవింద్ కేజ్రీవాల్ తో నితీష్ కుమార్ సోమవారం సమావేశమయ్యారు. ఈసందర్భంగా వారు తాజా రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది.  వారిద్దరు ఏవిషయాలపై చర్చించారనేది  అధికారికంగా ఇరుపార్టీల నుంచి ఎటువంటి ప్రకటన విడుల కాలేదు.

ఇవి కూడా చదవండి

బీజేపీతో దోస్తికి కటీఫ్ చెప్పి ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన తర్వాత తొలిసారి నితీష్ కుమార్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. తన ఢిల్లీ పర్యటనలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కలుసుకున్నారు. ఈసందర్భంగా విపక్షాల ప్రధాని అభ్యర్థిత్వంపై స్పందింస్తూ.. తాను ఆపదవిని కోరుకోవడం లేదు. తాను విపక్షాల ప్రధాని అభ్యర్థిని కాదని స్పష్టం చేశారు. అయితే తాను ఆపదవిని కోరుకోవడం లేదని చెప్పారే తప్ప.. తాను అసలు ఆపదవిని స్వీకరించబోనని చెప్పలేదు. అసలు విషయం ఇక్కడే ఉంది. తానుమ కోరుకోవడం లేదు కాని.. అన్ని పార్టీలు కలిసి ప్రధాని అభ్యర్థిగా ఉండాలని కోరితే ఆయన అభిప్రాయం భిన్నంగా ఉండే అవకాశం ఉండొచ్చు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో నితీష్ కుమార్ బిజీబిజీగా ఉన్నారు. నితీష్ కుమార్ తో సమావేశం అనంతరం సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో ఇదో సానుకూల సంకేతమని, ప్రతిపక్ష పార్టీలన్ని కలిసి దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హర్యానా మాజీ సీఏం ఓం ప్రకాష్ చౌతాలతోనూ నితీష్ కుమార్ సమావేశం కానున్నారు.

సోమవారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నితీష్ కుమార్ తో దాదాపు గంటపాటు సమావేశమై తాజా రాజకీయాలపై చర్చించారు. జనతాదళ్ (సెక్యులర్) అధినేత హెచ్ డి కుమారస్వామిని కూడా నితీష్ కుమార్ కలిశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పార్టీలను ఏకం చేయడంతో పాటు.. తాను ముఖ్యపాత్ర పోషించాలనే ఉద్దేశంతోనే నితీష్ ఢిల్లీ పర్యటనకు శ్రీకారం చుట్టారని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంమీద నితీష్ రాజకీయ ఎత్తుగడలు ఎటువంటి ఫలితాలను ఇస్తుందనేది భవిష్యత్తులో తేలనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..