AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: ప్రయాణికులకు బిగ్ షాక్.. టికెట్లు క్యాన్సిల్‌ చేసినా డబ్బు చెల్లించాల్సిందే..

Indian Railways: కన్ఫామ్ అయిన రైలు, విమాన, హోటల్ టిక్కెట్లు రద్దు చేసుకుంటున్నారా? అయితే ఒక్క క్షణం ఆలోచించండి. ఆ టిక్కెట్లను వద్దనుకుంటే..

Indian Railways: ప్రయాణికులకు బిగ్ షాక్.. టికెట్లు క్యాన్సిల్‌ చేసినా డబ్బు చెల్లించాల్సిందే..
Trains And Flights
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 29, 2022 | 5:27 PM

Indian Railways: కన్ఫామ్ అయిన రైలు, విమాన, హోటల్ టిక్కెట్లు రద్దు చేసుకుంటున్నారా? అయితే ఒక్క క్షణం ఆలోచించండి. ఆ టిక్కెట్లను వద్దనుకుంటే రద్దు చార్జీలు చెల్లించాలని తెలుసు. కానీ ఇప్పుడు రద్దు చార్జీలపైనా వస్తు సేవల పన్ను కట్టాల్సి ఉంటుంది. దాంతో, టిక్కెట్లను రద్దు చేయడం కూడా ఖరీదైన వ్యవహారం కానుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త రకం జీఎస్టీ విధింపుపై సర్క్యులర్ జారీ చేసింది. ఆగస్టు 3వ తేదీన ఆర్థిక మంత్రిత్వ శాఖ పన్ను పరిశోధన విభాగం జారీ చేసిన ఈ సర్క్యులర్ ప్రకారం టిక్కెట్ల బుకింగ్ అనేది ఒక ‘కాంట్రాక్టు’ అని అని తెలిపింది. దీని కింద సర్వీస్ ప్రొవైడర్ వినియోగదారుడికి సేవలను అందిస్తానని హామీ ఇస్తుందని తెలిపింది. కాబట్టి టిక్కెట్లు రద్దు చేసుకున్నా పన్ను చెల్లించాల్సిందే అని స్పష్టం చేసింది.

ఈ నోటిఫికేషన్ ప్రకారం, ఫస్ట్ క్లాస్ లేదా ఏసీ కోచ్ టిక్కెట్‌ను రద్దు చేసేందుకు క్యాన్సెలేషన్ చార్జీపై అదనంగా 5 శాతం జీఎస్టీ విధిస్తారు. విమాన ప్రయాణం, హోటల్ టిక్కెట్లను క్యాన్సిల్ చేసినా ఐదు శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు వర్తించే జీఎస్టీ రేటునే రద్దు చేసుకున్నప్పుడు కూడా వర్తింపచేస్తున్నారు. క్యాన్సెలేషన్ ఫీజు అనేది ఒప్పంద ఉల్లంఘనకు బదులుగా జరిగే చెల్లింపు కాబట్టి దానిపై జీఎస్టీ కట్టాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ‘ప్రయాణికులు తమ ఒప్పందాన్ని ఉల్లంఘించినప్పుడు, సర్వీస్ ప్రొవైడర్‌కు చిన్న మొత్తంలో పరిహారం చెల్లించాలి. దీన్ని క్యాన్సెలేషన్ చార్జీగా వసూలు చేస్తారు. క్యాన్సెలేషన్ చార్జీ అనేది ఒప్పందాన్ని ఉల్లంఘించడం కాదు. అది ఒక పేమెంట్ మాత్రమే. కాబట్టి దానికి జీఎస్టీ వర్తిస్తుంది’ అని నోటిఫికేషన్ లో తెలిపింది. రైల్వే ప్రయాణాల్లో ఫస్ట్ క్లాస్, ఏసీ కోచ్ టిక్కెట్ల బుకింక్స్ పైనే ఐదు శాతం జీఎస్టీ విధిస్తున్నారు. సెకండ్ క్లాస్, ఇతర తరగతులకు జీఎస్టీ లేదు. కాబట్టి, ఫస్ట్ క్లాస్, ఏసీ కోచ్ ల టిక్కెట్లు రద్దు చేస్తేనే.. క్యాన్సెలేషన్ ఫీజుపై అదనంగా జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..