సీఎం సిద్ధరామయ్య ముందున్న పెను సవాళ్లు.. డీకేతో వేగేదెలా..? ఉచిత హమీల అమలు ఎలా..?

కర్నాటక రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యమంత్రి పీఠం కోసం ఇద్దర్ని బుజ్జగించిన కాంగ్రెస్ అధిష్టానం.. ఎట్టకేలకు సిద్దరామయ్య సీనియార్టికే పట్టంగట్టింది. కర్నాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య ప్రమాణస్వీకారం చేశారు. ఇంతకీ సిద్ధరామయ్య ముందున్న సవాళ్లు ఏంటి..?

సీఎం సిద్ధరామయ్య ముందున్న పెను సవాళ్లు.. డీకేతో వేగేదెలా..? ఉచిత హమీల అమలు ఎలా..?
DK Shivakumar, Siddaramaiah
Follow us

|

Updated on: May 20, 2023 | 5:08 PM

కర్నాటక రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యమంత్రి పీఠం కోసం ఇద్దర్ని బుజ్జగించిన కాంగ్రెస్ అధిష్టానం.. ఎట్టకేలకు సిద్దరామయ్య సీనియార్టికే పట్టంగట్టింది. కర్నాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య ప్రమాణస్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం చేశారు. బెంగళూర్‌‌ శ్రీకంఠీరవ స్టేడియంలో వారి ప్రమాణస్వీకారం కలర్‌ఫుల్‌గా జరిగింది. రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులతో ప్రమాణం చేయించారు.

సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మరో 8 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటక పీసీసీ ఉపాధ్యక్షుడు, దళిత నేత డాక్టర్‌ జి. పరమేశ్వరతోపాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గే కూడా మంత్రిగా ప్రమాణం చేశారు. వీరితోపాటు కేపీ ముణియప్ప, కేజే జార్జ్‌, ఎంబీ పాటిల్‌, సతీశ్‌ జర్కిహోళి, రామలింగారెడ్డి, బీజెడ్‌ జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌ మంత్రులుగా ప్రమాణం చేశారు. లక్షలాది మంది అభిమానులు ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. రాహుల్‌తో పాటు ప్రియాంకాగాంధీ ప్రమాణస్వీకారంలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ అగ్రనాయకత్వం, వివిధ పార్టీల నేతలు, సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఇంత వరకు బాగానే ఉంది. కంఠీరవ స్టేడియంలో అంతా కలర్ ఫుల్‌గానే సాగింది. కావాల్సిన పట్టాభిషేకం.. బలంగా కావాలనుకున్నవారికే అధిష్టానం కట్టబెట్టింది. కానీ అక్కడతో కర్నాటక కాంగ్రెస్‌ కథ సుఖాంతమైనట్టేనా..? ఇక సిద్ధరామయ్య… రాబోయే ఐదేళ్ల పాటు పాలనను నల్లేరుపై నడకలా సాగిస్తారా..? అసలు ఆయన ముందున్న చిక్కు ముళ్లేంటి..? ఎదుర్కోబోయే సవాళ్లేంటి? తెలుసుకోవాల్సిందే..

ఇవి కూడా చదవండి

డీకే శివకుమార్.. ఇదే సిద్ధరామయ్య ముందున్న అసలు సిసలైన సవాల్. సీనియారిటీ కావచ్చు.. గతంలో ఐదేళ్ల పాటు ఏకధాటిగా పాలించిన సత్తా కావచ్చు.. అన్నింటికీ మించి హైకమాండ్ ఆశీస్సులు కావచ్చు.. ప్రస్తుతానికి సిద్ధరామయ్య సీఎం కుర్చీలో సుఖాశీనులయ్యారు. కానీ అది ఎంత కాలం…? మల్లి ఖార్జున ఖర్గే చెప్పిన ఫార్ములా… అక్షరాలా అలాగే అమలవుతుందా… ప్రస్తుతానికి పీసీసీ చీఫ్ డీకే శివకుమార్.. తనకిచ్చిన ఉప ముఖ్యమంత్రి పదవితోనే సంతృప్తిగా ఉంటారా..? ఇన్నేళ్లుగా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన, అందినట్లే అంది చేజారిన సీఎం కుర్చీ కోసం రెండున్నరేళ్లు ఓపిగ్గా వేచి చూస్తారా..? ఇదే ప్రశ్న ఇప్పుడు సర్వాత్రా. అప్పుడే రాజయోగం లేదని.. అందుకే.. కామ్ డౌన్ అయ్యారని కొందరు అంటుంటే.. కాదు కాదు… హైకమాండ్ ఇచ్చిన హామీలే డీకేను ప్రస్తుతానికి కూల్ డౌన్ చేశాయని మరి కొందరు అంటున్నారు.  ఇలా ఎవరికి వారు రకరకాల ఊహాగానాలు చేస్తున్నా సిద్ధరామయ్య – డీకే ఇద్దరూ బయటకు చట్టపట్టాలేసుకొని అధికారాన్ని హాయిగా పంచుకున్నట్టే కెమరాల ముందు కనబడుతున్నారు. అయితే ఎక్కడో డౌట్… ఎన్నాళ్లు వీళ్లిద్దరి ఫ్రెండ్ షిప్ ఎంతకాలం ప్రశాంతంగా సాగుతుందని..? ఆ మాటకొస్తే.. సిద్ధరామయ్య మనసులో కూడా ఏదో మూల అదే డౌట్ ఉండకుండా ఉంటుందా…? వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గత చరిత్ర బాగా తెలిసిన ఆయనకు ముందున్న ఫస్ట్ ఛాలెంజ్… డీకేతో కలిసి నెట్టుకురావడమే.

ప్రస్తుతానికి 8 మందికి క్యాబినెట్లో చోటిచ్చారు. ఈ విషయంలో ఇప్పటికే ఎన్నో రిక్వెస్టులు మరెన్నో డిమాండ్లు.. హైకమాండ్ ముందు ఇటు సిద్ధరామయ్య ముందు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కర్నాటక వంటి రాష్ట్రాంలో క్యాస్ట్ ఈక్వేషన్స్‌ని బ్యాలెన్స్ చేస్తూ కేబినెట్‌ని ఏర్పాటు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఏ మాత్రం క్లారిటీ మిస్ అయినా.. కథంతా మళ్లీ మొదటికే వస్తుంది. అందుకే.. కేబినెట్ విస్తరణ కొత్త ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు కత్తిమీద సాములా మారింది. ఎవరికి ఏ మంత్రిత్వ శాఖ ఇవ్వాలో స్పష్టంగా హైకమాండ్ చెప్పగలిగితేనే అలకలు, జంపింగ్‌లు ఉండవు. లేదంటే మాత్రం కాంగ్రెస్‌కి మరో తలనొప్పి పట్టుకోక తప్పదు. అన్ని వర్గాలు, ప్రాంతాలు, వర్గాలు , పాత – కొత్త తరం శాసనసభ్యుల మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంటుంది. కర్ణాటక మంత్రివర్గంలో 34మందికి మాత్రమే అవకాశముండగా.. మంత్రి పదవులు ఆశించిన వారి సంఖ్య భారీగానే ఉంది. ఈ నేపథ్యంలో అందరిని ఒప్పించి. మెప్పించి మంత్రివర్గ కూర్పుతో పాలన సాగించాల్సి ఉంటుంది. సో.. ఇది ఆయన ముందున్న రెండో ఛాలెంజ్

ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది.. మ్యానిఫెస్టో అమలు. బీజేపీని ఓడించి కర్ణాటకలో సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ విజయానికి అనేక అంశాలు దోహదం చేసినప్పటికీ.. మేనిఫెస్టోలో ఆ పార్టీ ప్రకటించిన ఐదు ఉచిత పథకాలు ఎక్కువ ప్రభావం చూపించినట్లు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఇచ్చిన ఐదు ‘గ్యారంటీలపై తొలి సంతకం పెట్టారు సరే.. కానీ వాటి అమలు సాధ్యమేనా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్, రాష్ట్రంలోని కోటిన్నర మహిళలకు నెలకు 2వేలు, బీపీఎల్‌ కుటుంబానికి ఉచితంగా పది కిలోల బియ్యం, నిరుద్యోగ భృతి.. గ్రాడ్యుయేట్‌లకు 3వేల రూపాయలు, డిప్లొమా హోల్డర్లకు 1,500 రూపాయలు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి కీలకమైన ఐదు హామీలతో పాటు మత్స్యకారులకు ఉచితంగా ఏడాదికి 500 లీటర్ల డీజీల్‌ ఉన్నాయి. కాంగ్రెస్‌ ఇచ్చిన ఈ ఉచిత హామీలు నెరవేర్చాలంటే ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.62వేల కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంటే ఆ రాష్ట్ర బడ్జెట్లో సింహ భాగం ఈ ఐదు హామీల కోసమే వెచ్చించాల్సి ఉంటుంది.

ఉచితాల వల్ల రాష్ట్ర ఖజానాపై భారం పడుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కొవిడ్ విజృంభణ తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని అంటున్నారు. ఇలాంటి సమయంలో ఉచితాలు అమలుకు భారీ ఖర్చు చేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందంటున్నారు. 2022-23లో రాష్ట్ర బడ్జెట్‌లో రూ.14,699 కోట్ల రెవెన్యూ లోటు ఉంది.. మూలధన వ్యయానికి నిధుల కొరత ప్రాథమిక అభివృద్ధిపై ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రం 3 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది.

మొత్తంగా హామీలివ్వడం వరకు బాగానే ఉంది, కానీ వాటి అమలు విషయంలో సిద్ధరామయ్య.. ఎంత పెర్ఫెక్ట్‌గా ప్లాన్ చేస్తారన్నదానిపైనే అందరి దృష్టి ఉంది. ఒక వేళ అది అనుకున్నట్టుగా జరగకపోతే.. సిద్ధరామయ్యకు కష్టకాలం తప్పకపోవచ్చు. సో.. ఇది ఆయన ముందున్న ముడో సవాల్.

-బాలరాజు, టీవీ9 తెలుగు (డిజిటల్)

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..

భాగ్యనగరవాసులకు గుడ్‌న్యూస్ గిరిప్రదక్షిణకు స్పెషల్‌టూర్ ప్యాకేజ్
భాగ్యనగరవాసులకు గుడ్‌న్యూస్ గిరిప్రదక్షిణకు స్పెషల్‌టూర్ ప్యాకేజ్
కాస్కో బ్రదర్.. ఈ ఫోటోలోని గుడ్లగూబను కనిపెట్టగలరా..?
కాస్కో బ్రదర్.. ఈ ఫోటోలోని గుడ్లగూబను కనిపెట్టగలరా..?
రైల్వే కీలక నిర్ణయం.. విమానంలోలాగే రైలులో కూడా 'బ్లాక్‌ బాక్స్‌'
రైల్వే కీలక నిర్ణయం.. విమానంలోలాగే రైలులో కూడా 'బ్లాక్‌ బాక్స్‌'
T20 ప్రపంచకప్.. టీమిండియా ఎంపికకు డేట్ ఫిక్స్! హార్దిక్ ఉంటాడా?
T20 ప్రపంచకప్.. టీమిండియా ఎంపికకు డేట్ ఫిక్స్! హార్దిక్ ఉంటాడా?
బీఆర్‌ఎస్‌ ఓటమిని తట్టుకోలేకపోతోంది.. కిషన్ రెడ్డి ఫైర్..
బీఆర్‌ఎస్‌ ఓటమిని తట్టుకోలేకపోతోంది.. కిషన్ రెడ్డి ఫైర్..
హైదరాబాద్‌కు తాగునీటి కష్టాలు తీరినట్లేనా..?
హైదరాబాద్‌కు తాగునీటి కష్టాలు తీరినట్లేనా..?
ఫ్లైఓవర్‌పై కంగారుపడుతూ కనిపించిన యువకుడు.. ఏంటా అని చెక్ చేయగా
ఫ్లైఓవర్‌పై కంగారుపడుతూ కనిపించిన యువకుడు.. ఏంటా అని చెక్ చేయగా
దేశంలో జీరో వేస్ట్ జ్యూస్ షాప్.. కరెంట్ బిల్లు, గ్లాసుల ఖర్చు అదా
దేశంలో జీరో వేస్ట్ జ్యూస్ షాప్.. కరెంట్ బిల్లు, గ్లాసుల ఖర్చు అదా
ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు
ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు
బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!