Bhopal Gas Tragedy: భోపాల్ గ్యాస్ విషాధానికి సంబంధించిన కేసు కొట్టివేసిన సుప్రీంకోర్టు

1984 లో జరిగిన భోపాల్‌ గ్యాస్‌ లీకేజీ ప్రమాద బాధితులకు అదనపు నష్టపరిహారం చెల్లించాలంటూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Bhopal Gas Tragedy: భోపాల్ గ్యాస్ విషాధానికి సంబంధించిన కేసు కొట్టివేసిన సుప్రీంకోర్టు
Supreme Court Of India

Edited By: Anil kumar poka

Updated on: Mar 14, 2023 | 6:21 PM

1984 లో జరిగిన భోపాల్‌ గ్యాస్‌ లీకేజీ ప్రమాద బాధితులకు అదనపు నష్టపరిహారం చెల్లించాలంటూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. 40 ఏళ్ల నాటి అంశాన్ని లేవనెత్తడం వెనక ఉన్న హేతుబద్ధతను ప్రశ్నిస్తూ దాన్ని తోసిపుచ్చింది. విష వాయువు లీకేజీ ప్రమాదానికి కారణమైన యూనియన్‌ కార్బైడ్‌ కార్పొరేషన్‌ నుంచి ఈ పరిహారం రాబట్టే ఉద్దేశంతో కేంద్రం ఈ పిటిషన్ వేసింది. మూడువేలకుపైగా మరణాలు, పర్యావరణానికి తీవ్ర హాని కలిగించిన ఈ ఘటనలో అదనంగా రూ.7,844 కోట్ల మేర పరిహారం ఇవ్వాలని కోరింది. గతంలో జరిగిన సెటిల్‌మెంట్ సమయంలో ప్రమాద తీవ్రతను సరిగా అంచనా వేయలేదని వాదించింది. అయితే విష వాయువు బాధితులకు రూ.715 కోట్ల పరిహారం చెల్లింపుపై తీర్పు వెలువడి చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత దాఖలైన పిటిషన్‌పై, విచారణార్హతను ప్రతివాదులు ప్రశ్నిస్తున్నారంటూ గతంలోనే కోర్టు వ్యాఖ్యానించింది.

తాజాగా ఈ పిటిషన్‌పై ఉన్న హేతుబద్ధతను కోర్టు ప్రశ్నించింది. చాలా కాలం తర్వాత ఈ సమస్యను లేవనెత్తడానికి సరైన కారణం చూపెట్టకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వ వాదనతో మేం సంతృప్తి చెందలేమని సుప్రీం ధర్మాసనం తేల్చిచెప్పింది. మోసం జరిగినట్లు తేలితే ఆ సెటిల్‌మెంట్‌ను పక్కనపెట్టవచ్చని, అయితే ఇక్కడ ప్రభుత్వం అలాంటి వాదనేమీ చేయలేదని తెలిపింది. అయితే ఆ సెటిల్‌మెంట్‌ వేళ ఆ మొత్తం పరిహారం సరిపోదని ప్రభుత్వం చెప్పలేదని గత విచారణలో భాగంగా యూసీసీ అనుబంధ సంస్థలు వెల్లడిచాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..