Rahul Gandhi: ఇవాల్టితో ముగియనున్న రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర.. రేపు లాల్‌చౌక్‌లో భారీ బహిరంగ సభ

|

Jan 29, 2023 | 11:23 AM

రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ఇవాల్టితో ముగియనుంది. ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో పాదయాత్ర చేస్తున్న రాహుల్‌..కాసేపట్లో శ్రీనగర్‌ లాల్‌చౌక్‌ చేరుకుంటారు. అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.

Rahul Gandhi: ఇవాల్టితో ముగియనున్న రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర.. రేపు లాల్‌చౌక్‌లో భారీ బహిరంగ సభ
Rahul Gandhi
Follow us on

రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ఇవాల్టితో ముగియనుంది. ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో పాదయాత్ర చేస్తున్న రాహుల్‌.. కాసేపట్లో శ్రీనగర్‌ లాల్‌చౌక్‌ చేరుకుంటారు. అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఇక రేపు శ్రీనగర్‌లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లుచేస్తున్నారు కాంగ్రెస్‌ నేతలు. ఈ సభకు 21ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానం పంపారు. 2022 సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమైంది భారత్ జోడో యాత్ర. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్‌ నుంచి జమ్ముకశ్మీర్‌లోకి ప్రవేశించింది.

కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు దాదాపు 3,570కిలోమీటర్ల మేర సాగింది పాదయాత్ర. కాంగ్రెస్‌ శ్రేణులతో పాటు వివిధ వర్గాలు రాహుల్‌ వెంట నడిచారు. సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీ, రాబర్ట్‌ వాద్రాతో పాటు పలువురు కాంగ్రెస్‌ అగ్ర నేతలు జోడోయాత్రలో పాల్గొన్నారు. దాదాపు 145 రోజుల పాటు సాగిన పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలతో మమేకమయ్యారు రాహుల్‌. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాము అధికారంలోకి వస్తే వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని భరోసా కల్పించారు.

ఇక ఇవాల్టితో యాత్ర ముగియనుండగా..రేపు శ్రీనగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఏర్పాట్లుచేస్తున్న కాంగ్రెస్‌ నేతలు..భారీ జనమీకరణకు ప్రయత్నిస్తున్నారు. రాహుల్‌యాత్రలో పాల్గొనేందుకు పీడీఎఫ్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేతలతోపాటు పౌర సంఘాలు, యువకులు, సామాజిక కార్యకర్తలను ఆహ్వానించినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..