Man cut off his organ: భార్య పుట్టింటికి వెళ్లిందని.. తన అంగం కోసుకున్నాడు..! వైరల్ వీడియో.
భార్య పుట్టింటికి వెళ్లిందనే కోపంతో ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. పదునైన ఆయుధంతో తన అంగాన్ని కోసుకున్నాడు. ఈ ఘటన బీహార్‌లోని రాజ్ని నయానగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
భార్య పుట్టింటికి వెళ్లిందనే కోపంతో ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. పదునైన ఆయుధంతో తన అంగాన్ని కోసుకున్నాడు. ఈ ఘటన బీహార్‌లోని రాజ్ని నయానగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. రాజ్ని నయానగర్‌కు చెందిన కృష్ణ బసుకి, భార్య, ముగ్గురు అమ్మాయిలు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే కృష్ణ వృత్తిరీత్యా పంజాబ్‌లోని మండిలో పని చేస్తున్నాడు. రెండు నెలల క్రితం కృష్ణ తన సొంతింటికి తిరిగి వచ్చాడు. అయితే అతను వచ్చేసరికి భార్య ఇంట్లో లేదు. దీంతో భార్య అనిత గురించి తల్లిదండ్రులను ఆరా తీశాడు. పుట్టింటికి వెళ్లి, తిరిగి రాలేదని చెప్పారు. ఈ క్రమంలో కృష్ణ తీవ్ర ఆగ్రహాంతో ఊగిపోయాడు. క్షణికావేశంలో పదునైన ఆయుధంతో తన పురుషాంగాన్ని కోసుకున్నాడు. రక్తపు మడుగులో పడి ఉన్న అతన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే కృష్ణ గత కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం కృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
వామ్మో.. తుని రైల్వే స్టేషన్లో పాముల కలకలం..ఇదిగో వీడియో
మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం..
యజమాని మెసేజ్‌కు ఫిదా నెటిజన్లు

