Traffic Lights: హార్ట్ షేప్‌లోకి మారిన ట్రాఫిక్ సిగ్నల్స్.. ఎందుకనేగా మీ సందేహం..
సాధారణంగా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద రెడ్, గ్రీన్, ఆరెంజ్ కలర్స్ కనిపించడం చూసే ఉంటాం. వీటి ఆధారంగానే ప్రయాణికులు తమ ప్రయాణాన్ని సాగిస్తుంటారు. అయితే ఎక్కడైనా ఈ కలర్స్ రౌండ్‌గా ఉంటాయి. అయితే బెంగళూరులో మాత్రం ఈ సిగ్నల్స్ హార్ట్ షేప్‌లోకి మారాయి...

సాధారణంగా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద రెడ్, గ్రీన్, ఆరెంజ్ కలర్స్ కనిపించడం చూసే ఉంటాం. వీటి ఆధారంగానే ప్రయాణికులు తమ ప్రయాణాన్ని సాగిస్తుంటారు. అయితే ఎక్కడైనా ఈ కలర్స్ రౌండ్ షేప్ లో ఉంటాయి. అయితే బెంగళూరులో మాత్రం ఈ సిగ్నల్స్ హార్ట్ షేప్‌లోకి మారాయి. దీంతో అటుగా వెళ్తోన్న ప్రయాణికులు ఇలా ఎందుకు మార్చారని ఆశ్చర్యపోయారు. ఇంతకీ ట్రాఫిక్ సిగ్నల్స్ ఎందుకు మార్పు చేశారో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
మణిపాల్ హాస్పిటల్, బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా ఈ సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. గుండె ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఈ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా సిగ్నల్ జంక్షన్‌ల వద్ద ఒక క్యూఆర్ కోడ్‌ను కూడా ఏర్పాటు చేశారు. దీంతో ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో ఉంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా వైద్య సేవలు పొందేలా డిజైన్ చేశారు. నగరవ్యాప్తంగా 20 ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేసినట్లు మణిపాల్ హాస్పిటల్ తెలిపింది.
On the occasion of #WorldHeartDay, Manipal Hospitals installed innovations to encourage Bangalore to be a ‘heart smart city’. pic.twitter.com/cYSJPKx4uC
— Manipal Hospitals | #TogetherStronger (@ManipalHealth) October 2, 2022
ప్రపంచ హృదయ దినోత్సవాన్ని (సెప్టెంబర్ 29) పురస్కరించుకొని ప్రజల్లో హృద్రోగాలపై అవగాహన కల్పించేందుకునే ఈ ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగానే నగర వ్యాప్తంగా గుండె ఆరోగ్యానికి సంబంధించి ఆడియో మెసేజ్‌లను సైతం ప్లే చేశారు. ఇక సిగ్నల్స్‌లో హార్ట్ షేప్ ఏర్పాటు చేయడంపై ట్రాఫిక్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘వాహనాలు వేగంగా నడుపుతూ సిగ్నల్ జంప్ చేసే వారిని అలర్ట్ చేయడంతో పాటు, తమ రాకకోసం ఇంటి వద్ద సన్నిహితులు ఎదురు చూస్తున్నారనే సందేశం ఇవ్వడం కోసం ఈ విధానం ఉపయోగపడుతుందని’ చెప్పుకొచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..