India 5G: భారత్‌లో రాకెట్ వేగంతో 5జీ .. ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్‌లో ఆసక్తికర విషయాలు..
ఇంటర్నెట్ టెస్టింగ్ కంపెనీ ఊక్లా కీలక ప్రకటన చేసింది. భారత్‌లో నిర్వహించిన 5G టెస్ట్ నెట్‌వర్క్‌లో డౌన్‌లోడ్ వేగం 500 Mbps (సెకనుకు మెగాబిట్స్)ను తాకినట్లుగా వెల్లడించింది.

ఇంటర్నెట్ టెస్టింగ్ సంస్థ ఊక్లా కీలక ప్రకటన చేసింది. తాజా భారత్‌లో నిర్వహించిన డేటా టెస్ట్ వివరాలను వెల్లడించింది. ఊక్లా కంపెనీ లెక్కల ప్రకారం, భారత్‌లో 5G టెస్ట్ నెట్‌వర్క్‌లో డౌన్‌లోడ్ వేగం 500 Mbpsకి చేరుకుందని తెలిపింది. ఇందులో రిలయన్స్ జియో 598.58 Mbps తో అగ్రస్థానంలో ఉండగా, ప్రత్యర్థి భారతి ఎయిర్‌టెల్ ఢిల్లీలో 197.98 Mbps నమోదు చేసింది. అక్టోబర్ 1 లాంచ్‌కు ముందు టెలికాం ఆపరేటర్లు తమ నెట్‌వర్క్‌లను పరీక్షిస్తున్నారని, 5G డౌన్‌లోడ్ వేగం 16.27 Mbps నుండి 809.94 Mbps వరకు ఉందని విశ్లేషణలో తేలింది. భారతదేశంలో టెలికాం ఆపరేటర్లు 5Gని దేశంలో ప్రారంభించక ముందే పరీక్షించినట్లుగా ఊక్లా డేటా హైలైట్ చేసింది. ప్రస్తుతం, 5G డౌన్‌లోడ్ వేగం 16.27 Mbps నుంచి 809.94 Mbps వరకు ఉందని డేటా చూపిస్తుంది. ఇది టెల్కోలు ఇప్పటికీ తమ నెట్‌వర్క్‌లను రీకాలిబ్రేట్ చేస్తున్నాయని సూచించింది.
ఈ నెట్‌వర్క్‌లు వాణిజ్య దశలోకి ప్రవేశిస్తున్నందున ఈ వేగం మరింత స్థిరంగా ముందుకు సాగుతుందని తెలిపారు ఊక్లాలోని ఎంటర్‌ప్రైజ్ ప్రధాన పరిశ్రమ విశ్లేషకుడు సిల్వియా కెచిచె.
జూన్ 2022 నుండి ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, వారణాసితోపాటు మరో నాలుగు మెట్రో నగరాల్లో 5G డౌన్‌లోడ్ స్పీడ్‌పై ఊక్లా తాజా నివేదికను అందించింది. జూన్ 2022 నుంచి ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, వారణాసితో సహా – నాలుగు మెట్రోలలో 5G డౌన్‌లోడ్ స్పీడ్‌ని ఊక్లా రికార్డ్ చేసింది. ముంబైలో ఎయిర్‌టెల్ 271.07 Mbps మధ్యస్థ డౌన్‌లోడ్ వేగంతో జియో కంటే వెనుకబడి ఉండగా.. రెండోది 515.38 Mbps వేగంతో ఉంది. దీనికి విరుద్ధంగా వీరిద్దరి వేగం విషయంలో కోల్‌కతాలో చాలా తేడా ఉంది.
భారతి ఎయిర్‌టెల్ మీడియన్ డౌన్‌లోడ్ వేగం 33.83 Mbps కాగా, జీయో 482.02 Mbps వద్ద చాలా వేగంగా డౌన్‌లోడ్ స్పీడ్‌ని కలిగి ఉంది. అయితే వారణాసిలో మాత్రం జీయో, భారతి ఎయిర్‌టెల్ దగ్గరగా కనిపించింది. జూన్ నుండి భారతి ఎయిర్‌టెల్ 516.57 Mbps నుంచి జీయో 485.22 Mbps వేగంతో 5G మధ్యస్థ డౌన్‌లోడ్ స్పీడ్‌ని సాధించింది. ఊక్లా లెక్కల ప్రకారం, ఆగస్టు 2022లో మొబైల్ డౌన్‌లోడ్ వేగం 13.52 Mbpsతో భారతదేశం ప్రపంచంలో 117వ స్థానంలో ఉంది.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం