AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎం యడియూరప్పకు పండ్లు ఇచ్చినందుకు మేయర్‌కు జరిమానా

కర్నాటకలో తాజా సంక్లిష్ట పరిస్థితుల నడుమ యడియూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అందులో.. బెంగుళూరు మేయర్ గంగాంబికే మల్లికార్జున్ ఒకరు. కాగా.. ఈ సందర్భంగా మేయర్ గంగాంబికే.. సీఎం యడియూరప్పకు పండ్లబుట్టను బహుకరించారు. ఇక్కడివరకూ బాగానే ఉన్నా.. ఆమె సీఎంకు పండ్లబుట్టను ఇచ్చినందుకు.. బెంగుళూరు మున్సిపల్ అధికారులు మేయర్‌కు జరిమానా విధించారు. ఏంటి షాక్ అవుతున్నారా.. నిజం ఆమె సీఎంకు పండ్ల బుట్ట ఇచ్చిందుకే జరిమానా విధించారు. […]

సీఎం యడియూరప్పకు పండ్లు ఇచ్చినందుకు మేయర్‌కు జరిమానా
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 03, 2019 | 8:38 PM

Share

కర్నాటకలో తాజా సంక్లిష్ట పరిస్థితుల నడుమ యడియూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అందులో.. బెంగుళూరు మేయర్ గంగాంబికే మల్లికార్జున్ ఒకరు. కాగా.. ఈ సందర్భంగా మేయర్ గంగాంబికే.. సీఎం యడియూరప్పకు పండ్లబుట్టను బహుకరించారు. ఇక్కడివరకూ బాగానే ఉన్నా.. ఆమె సీఎంకు పండ్లబుట్టను ఇచ్చినందుకు.. బెంగుళూరు మున్సిపల్ అధికారులు మేయర్‌కు జరిమానా విధించారు. ఏంటి షాక్ అవుతున్నారా.. నిజం ఆమె సీఎంకు పండ్ల బుట్ట ఇచ్చిందుకే జరిమానా విధించారు. ఎందుకంటే.. ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్న విషయం తెలిసిందే. ఆమె.. తీసుకొచ్చిన పండ్ల చుట్టూ ప్లాస్టిక్‌ కవర్‌తో చుట్టి ఉండడమే ఆమెకు జరిమానా పడేలా చేసింది. ఆ ఫొటో షోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెంగుళూరులో ప్లాస్టిక్ కవర్లను వినియోగించే వారిపై దాడులు చేసి మరీ భారీ ఎత్తున జరిమానాలు విధిస్తున్నారు. కానీ.. ఏకంగా మేయర్‌నే ఈ రూల్‌ని ఉల్లంఘించడంతో ఆమెకు రూ.500ల జరిమానాను విధించారు మున్సిపల్ అధికారులు.

జరిమానా విషయంలో స్పందించిన మేయర్ మాట్లాడుతూ.. సీఎంకి గిఫ్ట్ ఇవ్వడానికి పండ్ల బుట్ట తీసుకురావాల్సిందిగా తాను వేరేవారిని పంపిచినట్లు చెప్పారు. దాన్ని నేను చూసుకోకుండా ముఖ్యమంత్రికి ఇచ్చానని.. అయినా.. చట్టం ముందు అందరూ సమానమే కాబట్టి నేను ఖచ్చితంగా ఆ ఫైన్ కడతానని తెలిపారు బెంగుళూరు మేయర్ గంగాంబికే మల్లికార్జున్.

రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
ఒకప్పుడు ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
ఒకప్పుడు ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
ఈ లయ 'శృతి' తప్పింది.. ఇంకాస్త అతి చేసి...
ఈ లయ 'శృతి' తప్పింది.. ఇంకాస్త అతి చేసి...
ఇండియా వర్సెస్ కివీస్.. జనవరి 11 నుంచి టీవీలకు అతుక్కుపోండి
ఇండియా వర్సెస్ కివీస్.. జనవరి 11 నుంచి టీవీలకు అతుక్కుపోండి
రాజకీయాల్లోకి దిగిన హీరోయిన్..
రాజకీయాల్లోకి దిగిన హీరోయిన్..
పోలీసులను చూసి స్పీడ్ పెంచిన అంబులెన్స్ డ్రైవర్.. ఆపి తనిఖీ చేయగా
పోలీసులను చూసి స్పీడ్ పెంచిన అంబులెన్స్ డ్రైవర్.. ఆపి తనిఖీ చేయగా
మీ ఫోన్‌లో వాట్సప్ అకౌంట్ బ్యాన్ అయిందా..? ఇలా చేస్తే చాలు..
మీ ఫోన్‌లో వాట్సప్ అకౌంట్ బ్యాన్ అయిందా..? ఇలా చేస్తే చాలు..
అరటిపండు ఏ టైమ్‌లో తినాలి.. ఎప్పుడు పడితే అప్పుడు తింటే..
అరటిపండు ఏ టైమ్‌లో తినాలి.. ఎప్పుడు పడితే అప్పుడు తింటే..