Bengaluru, October 08: కర్నాటక రాజధాని బెంగళూరులో దారుణ ఘటన వెలుగు చూసింది. డబ్బు కోసం కట్టుకున్న భార్యనే బ్లాక్ మెయిల్ చేశాడు. సన్నిహితంగా ఉన్న వీడియోలు, ఫోటోలను బయటపెడతానంటూ టార్చర్ చేశాడు. ఈ సైకో టార్చర్ భరించలేక మహిళ నేరుగా పోలీసులను ఆశ్రయించింది. దీంతో మ్యాటర్ హాట్ డిస్కషన్ అయ్యింది. ఇంతకీ మ్యాటర్ ఏంటో ఓసారి చూద్దాం.
భార్యను ప్రేమగా చూసుకున్నాడు. భార్యపై తనకు వల్లమాలిన ప్రేమ ఉన్నట్లు నటించాడు. పెళ్లైన కొత్తలో తన భార్యను హనీమూన్‌కు థాయిలాండ్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఇద్దరూ ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. అయితే, అదే ఆమె పాలిట శాపమైంది. హనీమూన్‌కి వెళ్లిన సందర్భంలో మహిళ భర్త ఆమెకు నీలిచిత్రాలు చూపించడం మద్యం తాపించడం చేశాడు. అయితే, అవన్నీ భర్త సీక్రెట్‌గా ఫోన్‌లో రికార్డ్ చేసి పెట్టుకున్నాడు. ట్రిఫ్ పూర్తయ్యేంత వరకు తనకేమీ తెలియదన్నట్లుగానే నటించాడు. థాయిలాండ్ నుంచి బెంగళూరు రిటర్న్ వచ్చారు. ఇక అప్పటి వరకు ఉన్న మాస్క్ తీసేశాడు ఆ సైకో మొగుడు. తనకు రూ. 10 లక్షలు ఇవ్వాలని, ఆమె ఉద్యోగం ద్వారా సంపాదించిన జీతం మొత్తం తనకే ఇవ్వాలంటూ వేదించడం ప్రారంభించాడు.
కట్టుకున్న భర్తే కదా అని భరిస్తూ వచ్చింది. కానీ, రోజు రోజుకు అతని వేధింపులు మరింత శృతిమించాయి. డబ్బులు ఇవ్వకపోతే ప్రైవేట్ వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దాంతో ఇక లాభం లేదనుకున్న బాధిత మహిళ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. జరిగిన విషయం మొత్తాన్ని పోలీసులకు తెలియజేసింది. పెళ్లికి ముందు తనకు ఒక కంపెనీ ఉందని నమ్మబలికాడని, పెళ్లి తరువాత అసలు అతనికి ఉద్యోగమే లేదని నిజం తెలిసిందని వాపోయింది మహిళ. పెళ్లైన మొదట్లో బాగానే ప్రవర్తించాడని, ఆ తరువాత టార్చర్ చేయడం మొదలుపెట్టాడని ఆవేదన వ్యక్తంచేసింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..