AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధాని నరేంద్ర మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు, బీబీసీ రేడియో షో లో వక్తపై నెటిజన్ల ఫైర్

బీబీసీ ఏషియా నెట్ వర్క్ ఆ మధ్య నిర్వహించిన బిగ్ డిబేట్ రేడియో షో లో పాల్గొన్న ఓ వక్త.. భారత ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీపై చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి....

ప్రధాని నరేంద్ర మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు, బీబీసీ రేడియో షో లో వక్తపై నెటిజన్ల ఫైర్
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకం పోస్టాఫీసులో మాత్రమే అందుబాటులో ఉంటుంది. 18 ఏళ్లపైన వారు.. లేదా మైనర్లు ఉంటే.. ముగ్గురు కలిసి ఉమ్మడి ఖాతాను తెరవచ్చు. మరిన్ని వివరాల కోసం మీ దగ్గర్లోని పోస్టాఫీసులో సంప్రదించండి.
Umakanth Rao
| Edited By: Ravi Kiran|

Updated on: Mar 03, 2021 | 4:35 PM

Share

బీబీసీ ఏషియా నెట్ వర్క్ ఆ మధ్య నిర్వహించిన బిగ్ డిబేట్ రేడియో షో లో పాల్గొన్న ఓ వక్త.. భారత ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీపై చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. సోషల్  మీడియాలో ఆ మహిళ చేసిన కామెంట్స్ ని అనేకమంది దుయ్యబట్టారు.బ్రిటన్ లో సిక్కులు, భారతీయులపై జాతి వివక్షకు సంబంధించి జరిగిన ఈ చర్చాగోష్టి లైవ్ గా సాగుతుండగా.. చటుక్కున ఓ దశలో ఇది పక్కదారి పట్టింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన అన్నదాతల ఆందోళన వైపు చర్చ మళ్లింది. ఈ సందర్భంగా ఆ వక్త.. మోదీ తల్లి హీరాబెన్ మోదీ పట్ల అపభ్రంశ వ్యాఖ్యలు చేశారు. ట్విటర్ లో ఆ ఘటనకు సంబంధించి వీడియో షేర్ కాగా పలువురు తీవ్రంగా స్పందించారు. ఈ రేడియో షో ను, బీబీసీని తప్పు పట్టారు. అసలు ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం ప్రకటించకుండా,, ఈ షో ప్రసారాన్ని నిలిపివేయకుండా కొనసాగేందుకు ఎలా అనుమతించారని చాలామంది ఫైరయ్యారు.

ఆ వక్త వాడిన భాష చాల దారుణమని,  గర్హనీయమని అజయ్ జోబిన్, కిరణ్ బిలాఖియా వంటివారు తమ ట్వీట్లలో ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. రైతు చట్టాలను రద్దు చేయాలంటూ  పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన వేలాది రైతులు సుమారు 3 నెలలుగా ఢిల్లీ శివార్లలో ఆందోళన నిర్వహించారు. పైగా పంజాబ్ లో ఢిల్లీ-అమృత్ సర్, లూథియానా-అమృత్ సర్ రైల్వే మార్గంలో వందలాది మంది రైలు పట్టాలపై కూర్చుని నిరసన తెలిపారు. దేశంలో ఇంత పెద్దఎత్తున అన్నదాతల ఆందోళన గతంలో ఎన్నడూ జరగలేదు. వివాదాస్పదమైన ఈ చట్టాలు మూడింటిని రద్దు చేయకపోతే దేశ వ్యాప్త ఆందోళనకు పూనుకొంటామని కూడా వారు హెచ్చరించారు. అయినా బీబీసీ వారి చర్చా గోష్టిలో ప్రధాని మోదీ తల్లి ప్రస్తావన ఎందుకని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సుమారు 100 ఏళ్ళ వయస్సు గల హీరాబెన్ మోదీని కనీసం ఆమె వయస్సును చూసైనా గౌరవించాలని వారంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి:

హాలీడే ట్రిప్ కోసం కేరళ వెళ్తున్నారా ? అయితే మీకోసం కేరళలోని అద్భుతమైన పర్యాటక ప్రాంతాల వివరాలు..

తెలంగాణ సంక్షేమ పథకాలు ఆ రాష్ట్రాల్లో ఎందుక లేవో అడగండి.. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మంత్రులు