తెలంగాణ సంక్షేమ పథకాలు ఆ రాష్ట్రాల్లో ఎందుక లేవో అడగండి.. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మంత్రులు

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ స్పీడ్‌ పెంచింది. జిల్లాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ మంత్రులు..

తెలంగాణ సంక్షేమ పథకాలు ఆ రాష్ట్రాల్లో ఎందుక లేవో అడగండి.. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మంత్రులు
Follow us

|

Updated on: Mar 03, 2021 | 4:16 PM

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ స్పీడ్‌ పెంచింది. జిల్లాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ మంత్రులు ప్రచారం నిర్వహిస్తున్నారు. మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణి దేవికి మద్దతుగా తాండూరులో సన్నాహక సమావేశం. ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి , ఎంపీ రంజిత్ రెడ్డి ఇతర టీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ఎన్నికల్లో గెలుపు కోసం ఇంచార్జ్ ల బాధ్యతగా పని చేయాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. హైదరాబాద్‌ సీటు పక్కగా గెలవాలని చెప్పారు. మొదటి ప్రాధాన్యత లోనే గెలిచి తీరుతుంది, మన కార్యకర్తల ఓట్లు మనం నమోదు చేయించుకున్నమ్. 90 శాతం ఓట్లు మనవే ఉన్నాయి, ఈ ఓటర్లను అందరిని పోలింగ్ భుత్ కు తీసుకోనిరావాల్సిన బాధ్యత మనందరిదని కార్యకర్తలకు మంత్రి హితబోధ చేశారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఏ రాష్ట్రంలో లేవన్నారు మంత్రి హరీశ్‌రావు. పక్కనే కర్ణాటక రాష్ట్ర సరిహద్దు గ్రామం చించోలి ఉంది అక్కడ రోజుకు 10 సార్లు కరెంట్ పోతుంది. అక్కడ రైతు బంధు, రైతు భీమా లేదు,కల్యాణ లక్ష్మి లేదు. కర్ణాటక లో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎం చేస్తుందో ఎక్కువగా మాట్లాడుతున్న బీజేపీ నేతలను తీసుకెళ్లి చూపించాలన్నారు. ఓటు వేసేటప్పుడు పెరిగిన పెట్రోల్ రేట్లను చూసి ఓటు వేయమని పట్టభద్రులను కోరాలన్నారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతుకు గిట్టుబాటు ధర లేదు. గతంలో కందుల కొనుగోలు కేంద్రాలు తాండూరు లో ఏర్పాటు చేసే, కర్ణాటక, చించోలి రైతులు అక్కడి కందులు తెచ్చి ఇక్కడ అమ్మే ప్రయత్నం చేశారు. కర్ణాటక ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు కాబట్టే తెలంగాణ కు వచ్చారు. ఒక్క నెలలోనే 3 సార్లు గ్యాస్ రేటు పెంచిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదని మంత్రి ఎద్దేవా చేశారు. మార్చి 8 న మహిళ దినోత్సవం ఉంది ఆరోజు ఘనంగా జరపాలి. ఆరోజు మహిళ ఓటర్లను పిలువండి, ఘనంగా మహిళ దినోత్సవం చేసి వాణి దేవి కి ఓటు వేయాలని పిలుపునివ్వాలని సూచించారు.

సోషల్ మీడియా లో అక్టీవ్ గా ఉండాలి, రోజు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చెప్పాలి. వైద్యులు, ప్రైవేట్ టీచర్స్, లాయర్లు వాణి దేవికి మద్దతు తెలిపారు. బీజేపీ సిట్టింగ్ సీటును గెలిచి మన సత్తా ఏంటో చూపించాలన్నారు మంత్రి హరీశ్‌రావు. గ్రాడ్యుయేట్ ఓటర్లు ఆయనను 6 ఏండ్లుగా ఎమ్మెల్సీగా ఉండు అని గెలిపించారు. కానీ ఆయన మల్కాజిగిరి ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయారు, ఎంపీకి పోటీ చేసి అదీ ఓడిపోయారు. ఆయన 30 నెలల్లో 3 సార్లు పోటీ చేసి ఒడిపాయే అని ఎద్దేవా చేశారు. నువ్వే చెప్తున్నావ్ గ్రాడ్యుయేట్ ఓటు వేసిన ఎమ్మెల్సీ పదవి ఇష్టం లేదు అని ఎందుకు వేయాలి మళ్లీ ఆయనకు ఓటు అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ఈసారి ఓడ గొట్టి ముచ్చటగా మూడు సార్లు ఓడిపోయిన ఘనత ఆయనకు ఇద్దాం. ఒకవేళ ఎమ్మెల్యే గా,ఎంపీగా గెలిస్తే గ్రాడ్యుయేట్ లను మోసం చేసినట్టే గా. మిగత పార్టీ లు కనీసం పోటీలో లేవు. తప్పకుండా తాండూరు కు కృష్ణా నది జలాలు రానున్న రోజుల్లో వస్తాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎన్నికల్లో మీరందరూ వాణి దేవి విజయం కోసం పని చేయాలని కార్యకర్తలను కోరారు. పక్క రాష్ట్రాల్లో ఎం చేస్తున్నారు మన దగ్గర ఎం జరుగురుందో చూడాలన్నారు. రాంచందర్ రావు ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.ఆయన ఎన్నికైంది ఎమ్మెల్సీ కానీ గడిచిన 30 నెలల్లో 3 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు. దేశంలో అనేక రాష్ట్రాల కంటే అన్ని సంక్షేమ కార్యక్రమాలలో ముందు మన రాష్ట్రం ఉంది. బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాని ఎక్కడా ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు లేవో అడగండని ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు.

వాణి దేవి మాట్లాడుతూ ముందుకు రావడం కారణం సీఎం కేసీఆర్ అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలుచున్నాను. పట్టభద్రుల నియోజక వర్గంలో ఓటు ఉన్న మీరు అందరి సహకారం కావాలి. ఎన్నో యేండ్లు గా నెను విద్యాసంస్థల్లో పని చేసిన వ్యక్తిని, విద్యా సంస్థల సమస్యలపై నాకు పూర్తిగా అవగాహన ఉంది. విద్యార్థులకు ఒక్క తల్లిలాగా విద్యాబుద్ధులు చెప్పే విద్యాలయాలము. మంచి తరాన్ని సమాజానికి అందించే వ్యవస్థ విద్యా వ్యవస్థ. అలాంటి విద్యావ్యవస్థ లో అపార అనుభవం ఉన్న వ్యక్తిని నేను. ప్రతి గ్రాడ్యుయేట్ నాకు ఓటు వేయండి నన్ను గెలిపించండి అని వాణిదేవి కోరారు.

సీఎం కేసీఆర్ మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ప్రతి మహిళ నాకు ఓటు వేయాలని కోరుతున్నా. నాకు మొదటి ప్రియరిటీ ఓటు వేయాలి వేస్తున్నారని ఆశిస్తున్నా. తెలంగాణ ప్రభుత్వం లో విద్యా రంగానికి ఇది మొదటి అడుగు. ప్రపంచ పటం లో దేశాన్ని మా నాన్న గారు పెట్టారు అప్పడూ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో పెట్టారు మన సీఎం కేసీఆర్ అని వాణిదేవి అన్నారు.

మరో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ వాణి దేవిని అభ్యర్థిగా ప్రకటించగానే సగం గెలుపు సాధ్యం అయింది. ప్రతి ఓటర్ ను బూత్ కు తీసుకువచ్చే బాధ్యత మనది. మొన్న ఒక్కటి రెండు గెలువగానే వాపును చూసి బలుపు అనుకుంటున్నారు. వాళ్లకు గట్టిగా సమాదానం చెప్పాలి.ప్రభుత్వం ఎం చేస్తోంది అంటే ….సీఎం కేసీఆర్ ఎం చేస్తున్నారో, ఏం చేశారో.. పక్క రాష్ట్రాలను పోలిస్తే సరిపోతుంది. చార్మినార్ జోన్ చేయాలని సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం పంపిస్తే ఇప్పటివరకు చేయని బిజెపి ప్రభుత్వానికి ఓట్లడిగే హక్కు లేదన్నారు. తాండూరు లో మెజార్టీ ఓట్లు మనకు పడతాయి అని సీఎం కేసీఆర్ చెప్తున్నారు అందుకు అనుగుణంగా మనం ఓట్లు వేసి గెలిపించుకోవాలని సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.

Read more:

చీటికీ మాటికీ సవాళ్లు చేయడం వారికి అలవాటైంది.. చిల్లరగాళ్లతో డిస్కస్‌ చేసే సమయం మాకు లేదు -మంత్రి ఎర్రబెల్లి

బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి