Watch Video: మీరేం మనుషులు రా సామి.. అంత చిన్నదానికి ఇంతలా కొట్టాలా?.. అసలు ఏం జరిగిందంటే!
బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. డెలివరీ ఆలస్యం అయిందనే కారణంతో కొందరు యువకులు జొమాటో డెలివరీ బాయ్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో డెలివరీ బాయ్ తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడే ఉన్న కొందరు ఈ దృశ్యాలు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

మెట్రో నగరాలలో ట్రాఫిక్ గురించి జనాలకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడ వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నార్మల్‌గానే ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. ఇక వర్షా కాలం వస్తే మరీ దారుణం. ఒకటి రెండు కిలోమీటర్లు వెళ్లడానికే గంటల సమయం పడుతుంది. ఇలాంటప్పుడు మనం ఏదైనా ఆర్డర్ చేసుకుంటే అది రావడానికి కచ్చితంగా సమయం పడుతుంది. అయితే ఈ మాత్రం కూడా ఆలోచించకుండా ఒక కస్టమర్ డెలివరీ బాయ్ ఆర్డర్ లేట్‌గా తీసుకొచ్చాడని, తన ఫ్రెండ్స్‌తో కలిసి అతనిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. అయితే ఈ దాడికి గమనించిన స్థానికంగా ఉన్న ఒక వ్యక్తి ఈ తతంగాన్నంత వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
వైరల్ వీడియో ప్రకారం.. ఒక యువకుడు ప్లాస్టిక్ డబ్బాతో డెలివరీ బాయ్‌ను కొడుతున్న దృశ్యాలను మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఆ పక్కనే ఉన్న మరో వ్యక్తి అతనిపై కుర్చీతో దాడి చేస్తున్నాడు.. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఆ జోమాటో డెలివరీ బాయ్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. అయితే ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారి పోలీసుల దృష్టికి చేరడంతో.. పోలీసులు డెలివరీ బాయ్‌ను పిలిచి అతని స్టేట్‌మెంట్ తీసుకున్నారు.
అతని స్టేట్‌మెంట్ ఆధారంగా అతనిపై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకొని విచారించారు పోలీసులు. ఇలాంటి ఘటనలు మరోసారి రిపీట్ కావద్దని వారికి కౌన్సిలింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే డెలివరీ బాయ్ మాత్రం ఈ ఘటనపై అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది.
వీడియో చూడండి..
#Bengaluru @zomato delivery agent badly thrashed with chair over delayed arrival
A #Zomato delivery agent was violently assaulted by two men in Bengaluru near Shobha Theatre after arriving late with a food order on September 14. No formal complaint lodged at this point. pic.twitter.com/dBdKN1GFG5
— Harsh Trivedi (@harshtrivediii) September 19, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




