AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అయ్యో ఎంతపనైపాయె.. మూడో అంతస్తు నుంచి ఎలా పడ్డాడో చూడండి… సీసీటీవీ కెమెరాలో రికార్డ్‌ కాకుంటే ఎవరూ నమ్మరు…

ఇటీవల సోసల్‌ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. వేసే ప్రతి అడుగులో అప్రమత్తంగా లేకుంటే ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తాయో ఈ వీడియోనే నిదర్శనం. సాధారణంగా రోడ్డు మీద ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్లే. అలాంటి సంఘటనే ఈ వీడియోలో...

Viral Video: అయ్యో ఎంతపనైపాయె.. మూడో అంతస్తు నుంచి ఎలా పడ్డాడో చూడండి... సీసీటీవీ కెమెరాలో రికార్డ్‌ కాకుంటే ఎవరూ నమ్మరు...
Cloth Merchant Fall From 3r
K Sammaiah
|

Updated on: Sep 19, 2025 | 4:51 PM

Share

ఇటీవల సోసల్‌ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. వేసే ప్రతి అడుగులో అప్రమత్తంగా లేకుంటే ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తాయో ఈ వీడియోనే నిదర్శనం. సాధారణంగా రోడ్డు మీద ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్లే. అలాంటి సంఘటనే ఈ వీడియోలో కనిపిస్తుంది. ఒక వ్యాపారవేత్త ప్రమాదవశాత్తు బిల్డింగ్‌ మూడో అంతస్తు నుంచి కిందపడ్డాడు. అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రాకార్డ్‌ కావడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

వీడియోలో ఓ బట్టల వ్యాపారవేత్త వెనుకకు నడుచుకుంటూ వెళ్లి బ్యాలెన్స్‌ తప్పి కింద పడిపోతాడు. ఇది గమనించిన షాపు సిబ్బంది పరుగున అక్కడకు వెళ్లడం వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. సెప్టెంబర్ 9న సాయంత్రం 5:50 గంటల సమయంలో బ్లాక్‌ టీ షర్ట్ ధరించిన వ్యాపారి బట్టల కట్టను చెక్‌ చేసిన తర్వాత ఈ ప్రమాదానికి గురవుతాడు.

వీడియో చూడండి:

ఒక చేతిలో వాటర్‌ బాటిల్‌ పట్టుకున్న ఆ వ్యక్తి వెనక్కి నడుస్తూ అకస్మాత్తుగా బ్యాలెన్స్ ఔట్‌ అయి అంత ఎత్తు నుంచి కింద పడిపోతాడు. బిల్డింగ్‌ మూడో అంతస్తులోని పిట్టగోడ నుంచి కిందకు పడిపోయాడు. గమనించిన ఆ షాపు సిబ్బంది అక్కడకు పరిగెత్తినట్లు వీడియోలో కనిపిస్తుంది. తీవ్రంగా గాయపడిన అతడిని దగ్గరలోని ఆస్పత్రిలో చేర్పించారు. ఆ అంతస్తులోని బట్టల షాపు వద్ద ఉన్న సీసీటీవీలో ఇది రికార్డ్‌ కావడంతో అది నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై నెటిజన్స్‌ రకరకాలుగా స్పందిస్తూ పోస్టులు పెడుతున్నారు.