AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కోర్టులో పోలీసు ఆఫీసర్‌ను కుమ్మేసిన లాయర్లు… సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

సాధారణంగా పోలీసులు, లాయర్లు ఫ్రెండ్లీగా ఉంటారు. అయితే అక్కడ మాత్రం ఓ పోలీసు అధికారిపై లాయర్లు మూకుమ్మడి దాడి చేశారు. పోలీస్‌ అఫీసర్‌తో పాటు ఆయన వెంట ఉన్న కానిస్టేబుల్‌ను కూడా కుమ్మేశారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగిందీ ఘటన. దాడి చేస్తున్న దృశ్యాలు...

Viral Video: కోర్టులో పోలీసు ఆఫీసర్‌ను కుమ్మేసిన లాయర్లు... సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌
Lawers Attack On Police In
K Sammaiah
|

Updated on: Sep 19, 2025 | 5:28 PM

Share

సాధారణంగా పోలీసులు, లాయర్లు ఫ్రెండ్లీగా ఉంటారు. అయితే అక్కడ మాత్రం ఓ పోలీసు అధికారిపై లాయర్లు మూకుమ్మడి దాడి చేశారు. పోలీస్‌ అఫీసర్‌తో పాటు ఆయన వెంట ఉన్న కానిస్టేబుల్‌ను కూడా కుమ్మేశారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగిందీ ఘటన. దాడి చేస్తున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్‌ అయ్యాయి. దాడికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ దాడికి బరగావ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన భూ వివాదం కారణంగా తెలుస్తోంది.

ఎస్‌ఐ మిథిలేష్ ప్రజాపతి కానిస్టేబుల్ రాణా ప్రసాద్‌తో కలిసి వారణాసి కోర్టుకు విచారణ కోసం హాజరయ్యారు. అయితే గతంలో న్యాయవాదిపై దాడి చేసిన ఎస్‌ఐపై ప్రతీకారం కోసం లాయర్లంతా సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో కొందరు న్యాయవాదులు గుంపుగా వచ్చి పోలీస్‌ అధికారి మిథిలేష్ ప్రజాపతిపై దాడి చేశారు. పోలీసులు పారిపోతున్నా కూడా వెంటపడి మరీ కుమ్మేశారు. ఈ క్రమంలో ఎస్‌ఐ స్పృహ కోల్పోయారు. అయినా వదలకుండా ఈడ్చుకెళ్లి మరీ దాడి చేశారు.

అయితే కోర్టులోని మిగతా పోలీసులు జోక్యం చేసుకుని ఎస్‌ఐ మిథిలేష్ ప్రజాపతిని లాయర్ల నుంచి విడిపించారు. న్యాయవాదుల దాడిలో ఎస్‌ఐతో పాటు కానిస్టేబుల్ రాణా ప్రసాద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారిద్దరిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో లాయర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీస్‌ అధికారిపై న్యాయవాదుల దాడికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది.

వీడియో చూడండి:

Follow Us
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!
ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!
మోమోస్, నూడుల్స్ ప్రసాదంగా ఇచ్చే కాళీ ఆలయం.. ఈ దేవాలయం విశేషాలు..
మోమోస్, నూడుల్స్ ప్రసాదంగా ఇచ్చే కాళీ ఆలయం.. ఈ దేవాలయం విశేషాలు..
రేవంత్‌ అండ్ కిషన్‌..! సింగిల్ ఫ్రేమ్‌... డబుల్ ఎజెండా?
రేవంత్‌ అండ్ కిషన్‌..! సింగిల్ ఫ్రేమ్‌... డబుల్ ఎజెండా?
జూలైలో శక్తివంతమైన వ్యతీపాత యోగం.. ఈ 4 రాశుల వారికి ధనలాభం, విజయం
జూలైలో శక్తివంతమైన వ్యతీపాత యోగం.. ఈ 4 రాశుల వారికి ధనలాభం, విజయం
భారత్-పాక్ సరిహద్దుల్లో అర్ధరాత్రి హైడ్రామా!
భారత్-పాక్ సరిహద్దుల్లో అర్ధరాత్రి హైడ్రామా!
ఎండిపోతున్న మనీ ప్లాంట్‌కు జీవం పోసే సూపర్ కిచెన్ చిట్కాలు..
ఎండిపోతున్న మనీ ప్లాంట్‌కు జీవం పోసే సూపర్ కిచెన్ చిట్కాలు..
ఇవాళే OTTలోకి వచ్చేసిన బాక్సాఫీస్ సెన్సేషన్.. తెలుగులోనూ చూడొచ్చు
ఇవాళే OTTలోకి వచ్చేసిన బాక్సాఫీస్ సెన్సేషన్.. తెలుగులోనూ చూడొచ్చు
ఏలినాటి శని కారణంగా జూలైలో వీరికి వాయింపే వాయింపు..
ఏలినాటి శని కారణంగా జూలైలో వీరికి వాయింపే వాయింపు..