Viral Video: అయ్యో.. పరువు పాయే.. వాటి దెబ్బకు తోక ముడిచిన సింహం.. వీడియో వైరల్..
సోషల్ మీడియాలో వచ్చే జంతువుల వీడియోలను జనం ఇంట్రెస్ట్‌గా చూస్తారు. సింహాలు బలం ఏది నిలబడదు అంటారు. కానీ అదే సింహం తోకముడిచి పారిపోతున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మీరు కూడా ఈ వీడియో చూడండి..

సింహాన్ని అడవి రాజు అని ఎందుకు పిలుస్తారో మనందరికీ తెలుసు. దాని శక్తి, గంభీరత, నిర్భయత్వం వల్ల అడవిలో ఏ జంతువూ దాని ముందు నిలబడదు. కానీ ఒక్కోసారి పరిస్థితి తలకిందులవుతుంది. సింహాలు కూడా భయపడే జంతువులు కొన్ని ఉన్నాయని, వాటి ముందు తలవంచక తప్పదని నిరూపించే ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక సింహం చేసిన పని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోవడమే కాకుండా తెగ నవ్వుకుంటున్నారు.
వీడియోలో ఏముంది?
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో @VideosVuvu అనే యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. ఈ 34 సెకన్ల వీడియోలో ఒక అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. ఒక సింహం హాయిగా కూర్చొని ఉండగా దాన్ని ముందు ఒక మగ సింహం కాపలాగా ఉంది. అదే సమయంలో మూడు భారీ ఖడ్గమృగాలు వాటికి ఎదురుగా నిలబడ్డాయి.
సాధారణంగా సింహాన్ని చూస్తే ఏ జంతువైనా తోక ముడుచుకుని పారిపోతుంది. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తిగా రివర్స్ అయ్యింది. తన బలాన్ని ప్రదర్శించడానికి సింహం నెమ్మదిగా ఖడ్గమృగాల వైపు నడుచుకుంటూ వెళ్తుంది. అయితే సింహం కదలికలకు ఖడ్గమృగాలు ఏమాత్రం భయపడలేదు. బదులుగా అవి సింహం వైపు మెల్లిగా ముందుకు కదులుతూ దానిని బెదిరించడానికి ప్రయత్నించాయి. తానొక బలహీనమైన స్థితిలో ఉన్నానని గ్రహించిన సింహం, మూడు ఖడ్గమృగాలను ఎదుర్కోవడం కష్టమని భావించి వెనక్కి తిరిగి పరుగులు తీసింది. ఈ సన్నివేశం చూసిన వారు ఆశ్చర్యపోతూనే నవ్వుకుంటున్నారు.
నెటిజన్ల రియాక్షన్
ఈ వీడియోకు ఇప్పటి వరకు 124,000 పైగా వ్యూస్ వచ్చాయి. వందలాది మంది దీనిని లైక్ చేస్తూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఒక యూజర్ ఈ రోజు అడవి రాజు ఖడ్గమృగాల ముందు నిస్సహాయంగా కనిపించాడు అని కామెంట్ చేయగా.. మరొకరు ఖడ్గమృగాలతో గొడవ పడకూడదని నేర్చుకోవడానికి సింహం ఇప్పుడు ఒక గైడ్‌బుక్ చదవాల్సి ఉంటుంది కామెంట్ చేశారు. అయితే చాలామంది యూజర్లు ఈ ఘటనను ప్రకృతి సమతుల్యతకు ఉదాహరణగా అభివర్ణించారు. ప్రతి జంతువుకు దాని సొంత బలం ఉంటుంది. సింహాలు ఎల్లప్పుడూ గెలవవు. కొన్నిసార్లు అవి బలమైన జంతువులను ఎదుర్కొని ఓటమిని అంగీకరించాల్సి వస్తుంది. అని ఒక యూజర్ కామెంట్ చేశారు. ఏదిఏమైన నెట్టింట ఈ వీడియో వైరల్‌గా మారింది.
He wanted to impress his woman? pic.twitter.com/VnkRwjfGDi
— Vuvu Videos 🇿🇦 (@VideosVuvu) September 16, 2025
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
