Optical Illusion: మీకో సవాల్.. 7 సెకన్లలో ఈ ఫోటోలోని గుర్రం తలను గుర్తించండి.. సాల్వ్ చేస్తే మీరే తోపులు!
ఈ పజిల్ గేమ్స్‌ను చాలా మంది ఇష్టపడతారు. వారికి టైమ్ దొరికినప్పుడల్లా, వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంటారు. వాటిని సాల్వ్ చేసి హ్యాపీగా ఫీల్‌అవుతారు. ఇలాంటి పజిల్స్ సాల్వ్ చేయడం వల్ల మన జ్ఞాపశక్తి పెరుగుతుంది. మన ఐక్యూ కూడా మెరుగుపడుతుంది. ఇలాంటి చిత్రాలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా అలాంటిదో ఒక చిత్రం ట్రెండింగ్‌లో ఉంది. దీన్ని మీరు సాల్వ్ చేయాలనుకుంటే ఒకసారి ట్రైచేయండి.

ఆప్టికల్ ఇల్యూషన్స్ చిత్రాలనేవి మన కళ్ళకు బ్రమ కలిగించడమే కాకుండా మన మెదడుకు కూడా పనిచెప్తాయి. ఒక వేళ మనం ఈ చిత్రాలను ఫస్ట్ టైం చూస్తే గందరగోళానికి గురవుతాము. కానీ అలాగే దాన్ని క్షణ్నంగా పరిశీలించడం ద్వారా దానిలో దాగి ఉన్న వాటిని మనం గుర్తించగలం. అయితే కొన్నిసార్లు ఈ పజిల్‌ను పరిష్కరించడం చాలా కష్టంగా ఉండవచ్చు. కానీ ఈ చిత్రాలు మీ తెలివితేటలు, పరిశీలన నైపుణ్యాలను పెంచడంలో మీకు సహాయపడతాయి. తాజాగా ఇలాంటి ఒక చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఆ చిత్రంలో ఉన్న గుర్రాన్ని మీరు ఏడు సెకన్లలో కనుగొనాలి. మీరు ఈ ఫజిల్‌ను సాల్వ్ చేయాలనుకుంటే.. లేటెందుకు ట్రై చేయండి.
ఈ చిత్రంలో ఏముంది?
br4inteaserhub అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయబడిన ఒక ఆప్టికల్ ఇల్యూషన్ ఇమేజ్ ఇక్కడ ఉంది. మీరు ఆప్టికల్ ఇల్యూషన్ ఇమేజ్‌ని ఫస్ట్‌టైం చూసినప్పుడు మీకు ఇందులో ఒక ఏనుగు మాత్రమే కనిపిస్తుంది. కానీ దానిలో ఒక గుర్రం దాగి ఉంది. ఇక్కడ మీకు టాస్క్ ఏమిటంటే ఈ మొత్తం చిత్రంలో ఆ గుర్రం ఎక్కడుందో కేవలం ఏడు సెకన్లలో కనిపెట్టాలి. అయితే ప్రజ్ఞావంతులు, అసాధారణ పరిశీలన నైపుణ్యాలు ఉన్నవారు మాత్రమే ఈ పజిల్‌ను పరిష్కరించగలరు.
పోస్ట్ చూడండి..
View this post on Instagram
మీరు గుర్రాన్ని కనిపెట్టారా?
ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని మీరు ఎంత దగ్గరగా చూసినా, మీరు గుర్రాన్ని గుర్తించలేరు. ఎక్కువగా ఆలోచించకండి. అద్భుతమైన పరిశీలన నైపుణ్యాలు ఉన్నవారు మాత్రమే ఈ ఫోటోలో గుర్రం ముఖాన్ని గుర్తించగలరు. ఒక వేళ మీరు గర్తించలేకపోతే.. మేము మీకు కొన్ని సలహాలు ఇస్తాము. ఈ చిత్రంలోని కుడి వైపున జాగ్రత్తగా గమనించండి. ఈ పజిల్‌ను పరిష్కరించడానికి, ఏనుగు తోక దగ్గర ఉన్న ప్రాంతాన్ని దగ్గరగా చూడండి, అప్పుడు గుర్రం మీ దృష్టిని ఆకర్షిస్తుంది. దీంతో మీరు ఈ ఫజిల్‌ను ఈజీగా పరిష్కరించవచ్చు.
ఇది కూడా చదవండి: మీకో సవాల్.. ఈ ఫోటోలో ఎన్ని అంకెలున్నాయో చెప్పగలరా?.. చెప్తే మీరే తోపులు!
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




