వరద బీభత్సం.. ఏనుగు పిల్ల మృతి
కేరళలో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే అనేక జిల్లాల్లో భారీ వర్షాలకు నదులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. అనేక ప్రాంతాల్లో జనజీవనం స్థంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ..

కేరళలో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే అనేక జిల్లాల్లో భారీ వర్షాలకు నదులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. అనేక ప్రాంతాల్లో జనజీవనం స్థంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరద నీటికి అనేక పశువులు, జంతువులు కొట్టకుపోతున్నాయి. వరద నీటిలో చిక్కుకుని ప్రాణాలు విడుస్తున్నాయి. తాజాగా.. పతనంతిట్ట జిల్లాలోని అచన్‌కోవిల్ బ్రిడ్జ్ కింద ఓ పిల్ల ఏనుగు నీటిలో చిక్కుకుపోయి.. ప్రాణాలు విడిచింది. విషయం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీం.. సంఘటనా స్థలికి చేరుకుని ఏనుగు మృతదేహాన్ని బయటకు తీశారు. వరదల ప్రభావంతోనే మరణించి ఉంటుందని భావిస్తున్నారు.
A baby elephant found dead under Achankovil bridge near Pandalam in Pathanamthitta district, Kerala: State Information & Public Relations Department pic.twitter.com/pfYiitOE5l
— ANI (@ANI) August 7, 2020
Read More :
కర్ణాటకలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు మహారాష్ట్రలో తగ్గని కేసులు.. మళ్లీ 10వేలకు పైగానే