ఎనర్జీ డ్రింక్ తాగుతావా.. నువ్వో క్రిమినల్.. షమీపై వివాదాస్పద వ్యాఖ్యలు
TV9 Telugu
06 March 2025
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ షమీ తన అద్భుతమైన ఫాస్ట్ బౌలింగ్‌తో మూడు వికెట్లు పడగొట్టాడు.
అయితే, బౌండరీ లైన్ వద్ద షమీ ఎనర్జీ డ్రింక్ తాగుతున్నట్లు కనిపించడంతో కొంత మంది రాద్దాంత మొదలుపెట్టారు. అతివాద ముస్లిం సంస్థలు షమీ ఇలా ఎనర్జీ డ్రింక్ తాగడం తప్పుంటూ వివాదాస్పద వ్యాఖ్యలు మొదలుపెట్టారు.
షమీ ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. దానిపై పాజిటివ్ కామెంట్స్ సైతం వచ్చాయి.. రంజాన్ సమయంలో షమీ తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడంటూ చాలామంది నెటిజన్స్ అభినందిస్తున్నారు. దీంతో ముస్లిం మత నాయకుడు మౌలానా షాబుద్దీన్ ఒక వివాదాస్పద ప్రకటన చేశాడు.
రంజాన్ సమయంలో ఉపవాసాలు పాటించనందుకు షమీ షరియత్ చట్టాన్ని ఉల్లంఘించాడంటూ పేర్కొన్నాడు. అయితే సోషల్ మీడియాలో మాత్రం షమీ దేశం కోసం తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడంటూ చాలామంది నెటిజన్లు మద్దతు పలికారు.
ఈ మేరకు మౌలానా షాబుద్దీన్ మాట్లాడుతూ.. ఎవరైనా ఉపావాసాన్ని పాటించకపోతే వారు పాపాత్ములే. రోజాను పాటించకపోవడం వల్ల మహ్మద్ షమీ నేరం చేశాడు. షరియత్ నియమాల ప్రకారం, ఇలాంటి వ్యక్తులు నేరస్థులు' అంటూ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం రంజాన్ నెల జరుగుతోంది. ముస్లింలందరూ ఉపవాసం ఉంటారు. కానీ, మ్యాచ్ సమయంలో బౌలింగ్ చేస్తున్నప్పుడు అలసిపోయినట్లు అనిపించినప్పుడు షమీ ఎనర్జీ డ్రింక్ తాగుతుంటాడు. ఇక్కడే అసలు వివాదం చెలరేగింది.
షమీ గురించి చెప్పాలంటే, 2023 వన్డే ప్రపంచ కప్ తర్వాత, చీలమండ గాయం కారణంగా అతను ఒక సంవత్సరం పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లలో తిరిగి వచ్చాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో షమీ ప్రస్తుతం గొప్ప ఫామ్‌లో ఉన్నాడు. 4 మ్యాచ్‌ల్లో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు షమీ మార్చి 9న దుబాయ్ మైదానంలో టీమ్ ఇండియా తరపున ఫైనల్ ఆడనున్నాడు.